ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌దిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన రిష‌బ్ పంత్

ఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ప్రారంభమైంది.

By Medi Samrat  Published on  24 Nov 2024 4:55 PM IST
ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌దిక ధ‌ర‌కు అమ్ముడుపోయిన రిష‌బ్ పంత్

ఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ప్రారంభమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారులందరూ కూడా వేలానికి హాజరయ్యారు. నేడు తొలిరోజు వేలంపాట కాగా.. ఇది సోమవారం వరకు కొనసాగనుంది. ఈ వేలం పాట‌లో మొద‌ట రూ.18 కోట్ల‌తో జాక్‌పాట్ కొట్ట‌గా.. ఆ త‌ర్వాత రిష‌బ్ పంత్ రూ.27 కోట్ల‌తో ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌దిక ధ‌ర‌కు అమ్ముడుపోయాడు.. శ్రేయ‌స్ అయ్య‌ర్ కూడా రూ.26.75 కోట్లకు అమ్ముడుపోయాడు.

వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ నిలిచాడు. పంత్‌ రూ.26.75 కోట్లకు అమ్ముడుపోయిన శ్రేయాస్ అయ్యర్‌ను దాటాడు. మొదట్లో రిషబ్ పంత్ కోసం లక్నో, ఆర్సీబీ మధ్య పోరు నడిచింది. పంత్ రూ.2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి అడుగుపెట్టగా.. కొద్దిసేపటికే అతడి ధర రూ.10 కోట్లు దాటింది. ఈ సమయంలో హైదరాబాద్ కూడా రేసులో చేరినా లక్నో కూడా పట్టు వదలలేదు.

హైదరాబాద్ యజమాని కావ్య మారన్, లక్నో యజమాని సంజయ్ గోయెంకా వేలంలో పంత్ కోసం పోటీప‌డ్డారు. అనతికాలంలోనే ధర రూ.17 కోట్లు దాటింది. హైదరాబాద్, లక్నోలు ఇక్కడితో ఆగలేదు. పంత్‌పై వేలం పెరుగుతూనే ఉంది. పంత్‌కు లక్నో రూ.20.75 కోట్లకు బిడ్‌ వేయగా.., హైదరాబాద్‌ వెనుదిరిగింది. అయితే ఢిల్లీ మాత్రం ఆర్టీఎంను ఉపయోగించుకుంది. దీని తర్వాత లక్నో పంత్‌కు రూ.27 కోట్ల ఆఫర్ చేయ‌డంతో.. ఢిల్లీ చేతులు దులుపుకుంది. ఈ విధంగా పంత్‌ను రూ. 27 కోట్లకు విక్రయించగా.. ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.

Next Story