వారందరికీ షాక్ ఇస్తూ.. రిషబ్ పంత్ కు కెప్టెన్సీ పగ్గాలు..!

Rishabh Pant to lead Delhi Capitals. ఐపీఎల్ లో రిషబ్ పంత్ కు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా నియమిస్తూ ఉన్నామంటూ ఫ్రాంచైజీ ప్రకటన చేసింది.

By Medi Samrat  Published on  31 March 2021 5:09 PM IST
Rishabh Pant
రిషబ్ పంత్.. ఇటీవలి కాలంలో మూడు ఫార్మాట్లలోనూ భారతజట్టు తరపున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. రాబోయే కాలానికి.. కాబోయే స్టార్ అంటూ ఇప్పటికే అతడిని మాజీ క్రికెటర్లు ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఐపీఎల్ లో రిషబ్ పంత్ కు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా నియమిస్తూ ఉన్నామంటూ ఫ్రాంచైజీ ప్రకటన చేసింది.


ఐపీఎల్ 2021 సీజన్‌కి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ని ఆ టీమ్ ఫ్రాంఛైజీ తాజాగా నియమించింది. ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్న శ్రేయాస్ అయ్యర్ ఇటీవల ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతూ గాయపడ్డాడు. బంతిని నిలువరించే క్రమంలో శ్రేయాస్ అయ్యర్ డైవ్ చేయగా అతడి భుజం స్థానభ్రంశమైంది. ఏప్రిల్‌లో గాయానికి సర్జరీ చేయించుకోన్నాడు శ్రేయాస్ అయ్యర్. 4-5 నెలలు క్రికెట్‌కి దూరంగా ఉండబోతున్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్సీ అవకాశం పంత్‌కి ఇచ్చారు.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, గతంలో పంజాబ్ టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్, రాజస్థాన్ రాయల్స్‌ టీమ్‌కి కెప్టెన్‌గా పనిచేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ రేసులో ఉన్నప్పటికీ కెప్టెన్‌గా ఎలాంటి అనుభవం లేని 23 ఏళ్ల రిషబ్ పంత్‌‌ని ఢిల్లీ ఫ్రాంఛైజీ కెప్టెన్‌గా నియమించింది. ఢిల్లీ టీమ్‌తోనే తన ఐపీఎల్ జర్నీ ప్రారంభమైందని.. ఈ జట్టులోనే నేను క్రికెటర్‌గా ఎదిగానన్నాడు పంత్. ఎప్పటికైనా కెప్టెన్‌గా టీమ్‌ని నడిపించాలనేది నా కల.. ఇప్పుడు అది నెరవేరబోతోంది. ఈ కెప్టెన్సీని ఓ గౌరవంగా భావిస్తున్నానని రిషబ్ తెలిపాడు. రిషబ్ పంత్ ఇప్పటి వరకూ 68 మ్యాచ్‌లాడి.. 151.97 స్ట్రైక్‌రేట్‌తో 2,079 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రంజీ ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు పంత్ నాయకత్వం వహించాడు. ఇటీవలి కాలంలో పంత్ ఆడిన సంచలన ఇన్నింగ్స్ కారణంగానే పంత్ కు ఢిల్లీ కెప్టెన్ గా అవకాశం దక్కిందని స్పష్టంగా తెలుస్తోంది.


Next Story