వ‌న్డే సిరీస్ నుంచి పంత్ ఔట్‌.. కుల్దీప్ సేన్ అరంగ్రేటం

Rishabh Pant released from India squad minutes before 1st ODI.ఢాకా వేదిక‌గా భార‌త్, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య తొలి వ‌న్డే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Dec 2022 6:51 AM GMT
వ‌న్డే సిరీస్ నుంచి పంత్ ఔట్‌.. కుల్దీప్ సేన్ అరంగ్రేటం

ఢాకా వేదిక‌గా భార‌త్, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య తొలి వ‌న్డే జ‌రుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా భార‌త్ త‌రుపున కుల్దీప్ సేన్ అరంగ్రేటం చేయ‌నున్నాడు. ఇక వ‌రుస‌గా విఫ‌లం అవుతున్న వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. కేఎల్ రాహుల్ వికెట్ కీప‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నాడు. ఈ మ్యాచ్‌లో భార‌త్ ఇద్ద‌రు స్పిన్న‌ర్లు, న‌లుగురు పేస‌ర్ల‌తో బ‌రిలోకి దిగింది.

భార‌త జ‌ట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్

బంగ్లాదేశ్ జ‌ట్టు : లిట్టన్ దాస్ (కెప్టెన్), అనముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ (కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్ మహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్, ఎబాడట్ హుస్సేన్.

పంత్ ఔట్‌..

తొలి వ‌న్డేకు ముందు బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. బీసీసీఐ వైద్య బృందం స‌ల‌హా మేర‌కు పంత్‌ను వ‌న్డే సిరీస్ నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు తెలిపింది. పంత్ స్థానంలో వేరే ఆట‌గాడిని ఎంచుకోలేదు. అయితే.. పంత్‌కు ఏమైందో మాత్రం చెప్ప‌లేదు. కాగా.. ఇటీవ‌ల కివీస్‌తో ఆఖ‌రి మ్యాచ్‌లో ఔటైన త‌రువాత డ్రైస్సింగ్ రూమ్‌లో బైడ్‌పై పంత్ ప‌డుకున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. పంత్ వెన్నుగాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. తొలి వన్డేకు అక్షర్ పటేల్ అందుబాటులో ఉండటం లేదని బోర్డు తెలిపింది.

Next Story
Share it