అయ్యో.. ఆ లిస్ట్ లో కోహ్లీ లేకపోవడం ఏంటి.?

భారత టెస్ట్ జట్టులోకి సెంచరీతో పునరాగమనం చేసిన తర్వాత రిషబ్ పంత్ ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 6వ స్థానంలో అడుగుపెట్టాడు.

By Medi Samrat  Published on  25 Sep 2024 11:04 AM GMT
అయ్యో.. ఆ లిస్ట్ లో కోహ్లీ లేకపోవడం ఏంటి.?

భారత టెస్ట్ జట్టులోకి సెంచరీతో పునరాగమనం చేసిన తర్వాత రిషబ్ పంత్ ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 6వ స్థానంలో అడుగుపెట్టాడు. తాజా బ్యాటర్స్ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ టాప్ 10 నుండి అవుట్ అవ్వగా, కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా 5 స్థానాలు దిగజారాడు. చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో సెంచరీలు చేసిన తర్వాత పంత్, శుభ్‌మన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్‌ల ర్యాంకింగ్స్ మెరుగుపడ్డాయి. గిల్ రెండో ఇన్నింగ్స్‌లో 119 పరుగులతో అజేయంగా నిలిచి 5 స్థానాలు ఎగబాకి కెరీర్‌లో అత్యుత్తమ 14వ స్థానానికి చేరుకున్నాడు. అశ్విన్ మొదటి ఇన్నింగ్స్‌లో కీలకమైన 113 పరుగులు చేయడంతో అతను ఏడు స్థానాలు ఎగబాకి 72వ స్థానానికి చేరుకున్నాడు. జడేజా 86 పరుగులతో రాణించడంతో బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి 37వ స్థానానికి చేరుకున్నాడు.

అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన తర్వాత ఒక రేటింగ్ పాయింట్‌ను పొందడం ద్వారా టాప్ ర్యాంక్ బౌలర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు, జడేజా ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి ఆరో స్థానానికి చేరుకున్నాడు. 2వ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఆ తర్వాత వరుస స్థానాల్లో ఆస్ట్రేలియా బౌలర్లు హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ నిలిచారు.

ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో, జడేజా కెరీర్‌లో అత్యధికంగా 475 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రెండో స్థానంలో ఉన్న అశ్విన్ 370 పాయింట్లు సాధించాడు. తాజా అప్‌డేట్ తర్వాత ర్యాంకింగ్స్‌లో కోహ్లి 7వ స్థానం నుంచి 12వ స్థానానికి దిగజారాడు. జో రూట్ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.

Next Story