రిషబ్ పంత్‌కు ప్రమోషన్.. టీ20 జట్టుకు వైస్‌కెప్టెన్‌గా
Rishabh Pant promoted as India's Vice-Captain for T20I series.వన్డే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న టీమ్ఇండియా
By తోట వంశీ కుమార్ Published on 15 Feb 2022 2:44 PM ISTవన్డే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న టీమ్ఇండియా అదే ఉత్సాహంతో టీ20 సిరీస్‌కు సన్నద్దం అవుతోంది. కోల్‌కతా వేదికగా ఫిబ్రవరి 16 నుంచి భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది. అయితే.. టీమ్ఇండియాను గాయాలు వేదిస్తున్నాయి. ఇప్పటికే గాయాల కారణంగా కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ లు టీ20 సిరీస్‌కు దూరం కాగా.. తాజాగా ఈ జాబితాలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా చేరిపోయాడు. సోమవారం అతడు ప్రాక్టీస్ కూడా చేయలేదు. దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు స్పందించింది. వాషింగ్టన్ సుందర్ టీ20 సిరీస్‌కు దూరమవుతున్నట్లు ప్రకటించింది. అతడి స్థానంలో జయంత్ యాదవ్‌కు చోటు కల్పించింది.
పంత్‌కు ప్రమోషన్..
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను సెలక్టర్లు నియమించారు. కేఎల్ రాహుల్ గాయంతో దూరం కావడంతో పంత్‌కు ప్రమోషన్ లభించింది. దీంతో అతడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో టీమ్ఇండియా కెప్టెన్‌గా పంత్ నియమించేందుకే ప్రస్తుతం అతడికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 16, 18, 20 తేదీలలో 3 టీ20 మ్యాచ్‌లో జరగనున్నాయి.
టీమ్ఇండియా టీ 20 జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అవేష్ ఖాన్, యజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, జయంత్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్.