ఐపీఎల్-2024లో రిషబ్ పంత్ ఆడుతున్నాడా..?
రిషబ్ పంత్ ఆగమనంపై డీసీకి చెందిన ఉన్నతస్థాయి అధికారి సాగర్ స్పష్టత ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 7:13 AM GMTఐపీఎల్-2024లో రిషబ్ పంత్ ఆడుతున్నాడా..?
ఐపీఎల్ సీజన్-2024కు ఇప్పటికే ఆక్షన్ పూర్తయింది. ఇక కొద్ది నెలల్లోనే సీజన్ ప్రారంభం కాబోతుంది. కాగా...కొందరు ఆటగాళ్లు మాత్రం గాయాలపాలై ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దాంతో.. వారు ఈసారి సీజన్‌లో కనిపిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వీరిలో ఒకరే రిషబ్ పంత్. ఈ సారి దుబాయ్ వేదికగా ఐపీఎల్ లీగ్ జరగబోతుంది. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఉంది. గతంలో ఈ టీమ్‌కు సారథిగా రిషబ్ పంత్ కొనసాగాడు. అయితే.. కొంతకాలం క్రితం రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. దాంతో.. ఇంకా అతను ఆ గాయాల నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా నియమించుకున్నారు.
ఈ మేరకు రిషబ్ పంత్ ఆగమనంపై డీసీకి చెందిన ఉన్నతస్థాయి అధికారి సాగర్ స్పష్టత ఇచ్చారు. తప్పకుండా రిషబ్ పంత్ వచ్చే సీజన్‌లో ఆడతాడని ఆశిస్తున్నామన్నాడు. టాప్ ప్లేయర్ జట్టుతో ఉంటే తమకెంతో ప్రయోజనమన్నారు. కోచ్‌లు, ఫిజియో తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. పంత్ కూడా వేగంగా కోలుకుంటున్నాడని సాగర్ అన్నారు. మార్చి వరకు అతను ఫిట్‌నెస్ సాధిస్తాడనే నమ్మకంతో ఉన్నామన్నాడు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి వేలంలో పాల్గొన్నాడని చెప్పారు. ఇక మిడిలాడర్డర్‌ను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సాగర్ తెలిపారు. హ్యారీ బ్రూక్, జే రిచర్డ్‌సన్, షైహోప్ వంటి ప్లేయర్లను దక్కించుకున్నాడు. ఇక డేవిడ్ వార్నర్ నాయకత్వంలో అద్భుత ఫలితాలు సాధిస్తామని భావిస్తున్నట్లు సాగర్ పేర్కొన్నారు.