రిష‌బ్ పంత్ ఆరోగ్య ప‌రిస్థితిపై డాక్ట‌ర్లు ఏమ‌న్నారంటే.. ?

Rishabh Pant health bulletin.రిష‌బ్ పంత్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Dec 2022 7:16 AM GMT
రిష‌బ్ పంత్ ఆరోగ్య ప‌రిస్థితిపై డాక్ట‌ర్లు ఏమ‌న్నారంటే.. ?

టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పంత్ డెహ్రాడూన్‌లో మాక్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా.. పంత్ ఆరోగ్యంపై మాక్స్ ఆస్ప‌త్రి బులెటిన్ ను విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం పంత్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు తెలిపింది.

పంత్ కు చికిత్స అందిస్తున్న వైద్య బృందంలోని ఓ డాక్టర్ ఆశిష్ యాగ్నిక్ మాట్లాడుతూ.. పంత్ ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో ఉన్నాడు. అత‌డి కండీష‌న్ నిల‌క‌డ‌గానే ఉంది. ప‌రీక్ష‌ల‌న్నీ ముగిసిన త‌రువాత‌నే పూర్తిస్థాయి హెల్త్ బులిటెన్‌ను విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు.

ఈరోజు ఉద‌యం పంత్ ప్ర‌యాణీస్తున్న కారు రూర్కీ వ‌ద్ద డివైడ‌ర్‌ను ఢీ కొట్ట‌డంతో మంట‌లు చెల‌రేగాయి. అయితే..పంత్ చాక‌చ‌క్యంగా కారు విండో బ‌ద్ద‌లు కొట్టుకుని బ‌య‌ట‌కు రావ‌డంతో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. అత‌డి కారు పూర్తిగా ద‌గ్ధ‌మైంది. ఈ పంత్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అత‌డి అభిమానుల‌తో పాటు ప‌లువురు క్రీడాప్ర‌ముఖులు ఆకాంక్షిస్తున్నారు.

పంత్ కోసం ప్రార్థిస్తున్నా. దేవుడి ద‌య వ‌ల్ల అత‌డు ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు - వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్

వీలైనంత త్వ‌ర‌గా కోలుకో పంత్ - వీరేంద్ర సెహ్వాగ్‌

Next Story
Share it