పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్
పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నియమితులయ్యారు.
By Medi Samrat Published on 18 Sept 2024 5:57 PM ISTపంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నియమితులయ్యారు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌కు పాంటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ట్రెవర్ బేలిస్ స్థానంలో రికీ పాంటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. అంతకుముందు.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో రికీ పాంటింగ్ ఒప్పందం ముగిసింది. ఏడేళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగమైన రికీ పాంటింగ్ పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. పంజాబ్ కింగ్స్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఈ సమాచారాన్ని అందించింది.
పంజాబ్ కింగ్స్ కోచ్‌గా నియమితులైన తర్వాత రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. పంజాబ్ కింగ్స్ నాకు ప్రధాన కోచ్ బాధ్యతలు అప్పగించినందుకు సంతోషంగా ఉంది. కొత్త ఛాలెంజ్ పట్ల ఉత్సాహంగా ఉన్నాను. నా టీమ్ మేనేజ్‌మెంట్, టీమ్ తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను జట్టు దృష్టిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాను. భవిష్యత్తులో జట్టులో చాలా మార్పులను చూస్తామని మేము హామీ ఇస్తున్నానని పేర్కొన్నాడు.
గత ఏడు సీజన్లలో పంజాబ్ కింగ్స్ జట్టుకు రికీ పాంటింగ్ ఆరో ప్రధాన కోచ్ కావడం గమనార్హం. గత 10 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ ఫ్రాంచైజీ కేవలం రెండుసార్లు మాత్రమే ప్లేఆఫ్‌కు చేరుకుంది. 2024లో జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది.