తాను వేసుకునే జెర్సీ నుంచి మద్యం బ్రాండ్ లోగోను తీసివేయాల్సిందిగా ఆల్‌రౌండర్ మొయిన్ అలీ.. చెన్నైసూపర్ కింగ్స్(సీఎస్‌కే) యాజమాన్యానికి విజ్ఞప్తి చేశాడు. కాగా.. మొయిన్ అలీ చేసిన ప్రతిపాదనకు సీఎస్‌కే ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. అతడు వేసుకునే జెర్సీ పై నుంచి ఆ లోగోను తొలగించనున్నట్లు చెన్నై యాజమాన్యం స్పష్టం చేసింది. ఇంతకముందు మొయిన్ అలీ ఆర్‌సీబీ(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) కి ఆడినప్పుడు కూడా ఆల్కహాల్ లోగో లేని జెర్సీనే ధరించి ఆడాడు.
ఎందుకంటే.. తన మత విశ్వాసాల ప్రకారం మద్యం తాగడం, దానిని ప్రమోట్ చేయడం నిషిద్ధమని.. ఏ జెర్సీ మీద ఉన్నా తాను వాటిని ప్రోత్సహించనని చెప్పాడు. అది ఇంగ్లాండ్ జెర్సీ అయినా.. లేదంటే ఏ దేశవాళీ టీమ్ కైనా తాను మద్యం బ్రాండ్ల లోగోలు ఉన్న జెర్సీను ధరించనని తెలిపాడు. కాగా.. చెన్నై జెర్సీపై చెన్నైకి చెందిన ఎస్ఎన్ జే డిస్టిలరీస్ అనే సంస్థ తయారు చేస్తున్న ఎస్ఎన్ జే 10000 లోగో ఉంటుంది. కాగా.. మొయిన్ అభ్యంతరంతో అతడి జెర్సీపై నుంచి ఆ లోగోను తొలగించేందుకు చెన్నై అంగీకరించింది. కాగా.. 2021 వేలంలో చెన్నై జట్టు రూ.7కోట్లకు మొయిన్ అలీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.