ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు జాకబ్ బెథెల్ స్థానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్-బ్యాటర్ టిమ్ సీఫెర్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వెస్టిండీస్‌తో జరగనున్న వైట్-బాల్ సిరీస్ కోసం జాతీయ జట్టులో చేరడానికి బెథెల్ ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నాడు. 30 ఏళ్ల సీఫెర్ట్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ. 2 కోట్లకు తీసుకుంది. సీఫెర్ట్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ జట్టుతో చేరనున్నాడు.
వికెట్ కీపర్-బ్యాటర్ అయిన సీఫెర్ట్ న్యూజిలాండ్ తరపున 66 T20Iలు ఆడి 28 సగటుతో 1,540 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ బెథెల్ ఈ సంవత్సరం ప్రారంభంలో IPLలో అరంగేట్రం చేశాడు. ఈ సీజన్‌లో RCB తరపున రెండు మ్యాచ్‌లు ఆడి 67 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 12 పరుగులు చేసిన తర్వాత, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తన రెండవ మ్యాచ్‌లో బెథెల్ 33 బంతుల్లో 55 పరుగులు చేసి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు.