ముంబై గెల‌వ‌గానే ఆర్‌సీబీ ఆట‌గాళ్ల సంబ‌రాలు.. గంతులేసిన కోహ్లీ.. వీడియో వైర‌ల్‌

RCB share visuals of celebration after securing playoffs berth in IPL 2022.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2022

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 May 2022 1:57 PM IST
ముంబై గెల‌వ‌గానే ఆర్‌సీబీ ఆట‌గాళ్ల సంబ‌రాలు.. గంతులేసిన కోహ్లీ.. వీడియో వైర‌ల్‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2022 సీజ‌న్‌లో అత్యంత ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన మ్యాచుల‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ మధ్య పోరు ఒక‌టి. శ‌నివారం రాత్రి వాంఖ‌డే వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓడిపోయింది. దీంతో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఇక ఈ మ్యాచులో ముంబై విజ‌యం సాధించాల‌ని ముంబై అభిమానుల కంటే ఎక్కువగా ఆర్‌సీబీ అభిమానులు కోరుకున్నారు అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. అభిమానులు మాత్ర‌మే కాకుండా ఆర్‌సీబీ కీల‌క ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్‌తో పాటు ఆ జ‌ట్టు మొత్తం కోరుకుంది.

ఈ మ్యాచ్ మొత్తాన్ని బెంగ‌ళూరు జ‌ట్టు తాము బ‌స‌చేసిన హోట‌ల్‌లో వీక్షించింది. ముంబై వికెట్లు తీసిన‌ప్పుడు, ప‌రుగులు చేసిన‌ప్పుడు ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, మహ్మద్ సిరాజ్ ఇలా జ‌ట్టులోని ఆట‌గాళ్లంద‌రూ ఆనందంతో చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం, ఎగిరి గంతులు వేయ‌డం వంటివి చేశారు. ఇక విరాట్ కోహ్లీ మైదానంలో ఎలా అయితే ఉంటాడో అలాగే ఉన్నాడు. తామే మ్యాచ్ ఆడుతున్న‌ట్లు ఆర్‌సీబీ ఆట‌గాళ్లు ఫీలైయ్యారు.

ఇంక ముంబై గెల‌వ‌డంతో ఆర్‌సీబీ ఆట‌గాళ్ల ఆనందానికి హ‌ద్దే లేకుండా పోయింది. అంద‌రూ చిన్న పిల్ల‌ల్లా మారిపోయి ఎగిరిగెంతులేశారు. ఢిల్లీ ఓడిపోవ‌డంతో ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించ‌డ‌మే అందుకు కార‌ణం. ఇందుకు సంబంధించిన వీడియో ఆర్‌సీబీ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా ప్ర‌స్తుతం అది వైర‌ల్‌గా మారింది. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఆ వీడియోను ఓ సారి చూసేయండి.

ఇదిలా ఉంటే.. ఆర్‌సీబీ మే 25 బుధ‌వారం ఎలిమినేట‌ర్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జ‌ట్టు ఇంటికి వెలుతుంది. గెలిచిన గెట్టు తొలి క్వాలిఫ‌య‌ర్‌లో ఓడిన జ‌ట్టును ఢీ కొట్టుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకుంటుంది. ఇక ఫైన‌ల్ మ్యాచ్ మే 29 ఆదివారం జ‌ర‌గ‌నుంది.

Next Story