నేడు గ్రీన్ డ్రెస్ లో సందడి చేయనున్న ఆర్సీబీ

RCB players wear green jersey today. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నేడు గ్రీన్ రంగు బట్టల్లో కనిపించనుంది

By Medi Samrat
Published on : 23 April 2023 3:19 PM IST

నేడు గ్రీన్ డ్రెస్ లో సందడి చేయనున్న ఆర్సీబీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నేడు గ్రీన్ రంగు బట్టల్లో కనిపించనుంది. ఏప్రిల్ 23న రాజస్థాన్ రాయల్స్ (RR)తో మ్యాచ్ లో వారి బ్లాక్ అండ్ రెడ్ జెర్సీ కాకుండా గ్రీన్ జెర్సీలో ఆడనుంది. 2011 నుండి బెంగుళూరు ఫ్రాంచైజీ 'గో గ్రీన్' మ్యాచ్ ఆడుతుంది. ప్రతి సీజన్‌లో తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో గ్రీన్ డ్రెస్ లో ఒక మ్యాచ్ ఆడుతుంది. ఈ డ్రెస్ ద్వారా RCB జట్టు చెట్లను నాటడం, కార్బన్ వాడకాలను తగ్గించడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజ‌స్థాన్‌ బ్యాటింగ్ ఎంచుకుంది. కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా బెంగళూరుకి కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(w/c), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి(సి), ఫాఫ్ డు ప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(w), సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్


Next Story