ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే?

సాధారణంగా ఈ విషయాన్ని ఎక్కువగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఉపయోగిస్తూ ఉంటారు

By Medi Samrat  Published on  11 March 2024 7:34 PM IST
ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే?

సాధారణంగా ఈ విషయాన్ని ఎక్కువగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు విమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఇదే విషయమై ఆర్సీబీ అభిమానులు ఆలోచించాల్సి వస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC), ముంబై ఇండియన్స్ (MI) ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2024 ప్లేఆఫ్స్‌లో తమ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాయి. ఒక ప్లేఆఫ్ స్థానం కోసం.. 2 జట్లు - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), UP వారియర్జ్ (UPW) పోటీ పడుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరూ, యూపీ జట్లు రెండూ 7 మ్యాచ్‌లలో 6 పాయింట్లను సొంతం చేసుకున్నాయి. బెంగళూరు జట్టు +0.027 మంచి నెట్ రన్ రేట్ ఆధారంగా మూడవ స్థానంలో ఉన్నారు. మరోవైపు యూపీ నెట్ రన్ రేట్ -0.365 గా ఉంది.

తర్వాతి మ్యాచ్‌లో ఒక్క విజయం సాధించగానే RCB, యూపీ జట్లకు ప్లేఆఫ్ బెర్త్‌ని నిర్ధారించలేదు. మార్చి 12న తఆర్సీబీ చివరి లీగ్ గేమ్‌లో ముంబై ఇండియన్స్ (MI)తో తలపడనుంది. గత సంవత్సరం ప్రారంభ ఎడిషన్ నుండి WPL చరిత్రలో RCB ముంబై ఇండియన్స్ తో జరిగిన అన్ని 3 మ్యాచ్‌లలో ఓడిపోయింది. మరోవైపు వారియర్జ్ జట్టు గుజరాత్ జెయింట్స్ (GT)తో తలపడుతుంది. గుజరాత్ ఇప్పటికే టోర్నమెంట్ నుండి నిష్క్రమించగా.. విజయం సాధించి టోర్నమెంట్ ను ముగించాలని భావిస్తూ ఉంది ఆ జట్టు. టోర్నమెంట్ లీగ్ స్టేజ్ లో ఆర్సీబీ అసలైన సవాల్ ను ఎదుర్కోబోతోంది.

ఆర్సీబీ క్వాలిఫై అవ్వాలంటే?

ఇలా వెళ్లొచ్చు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ముంబై ఇండియన్స్ (MI)ని ఓడించాలి. UP వారియర్జ్ (UPW) గుజరాత్ జెయింట్స్ (GT) చేతిలో ఓడిపోవాలి.

UP వారియర్జ్ గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి, ఆర్సీబీ MI చేతిలో ఓడిపోతే, బెంగళూరు జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమిస్తుంది.

ఇలా కూడా క్వాలిఫై అవ్వొచ్చు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై గెలుపొంది, యుపి వారియర్జ్ (యుపిడబ్ల్యు) గుజరాత్ జెయింట్స్ (జిటి)పై గెలవాలి.

లేదా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ముంబై ఇండియన్స్ (MI) చేతిలో ఓడిపోయి, UP వారియర్జ్ (UPW) గుజరాత్ జెయింట్స్ (GT) చేతిలో ఓడిపోయినప్పుడు..

మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్టు ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవుతుంది.

Next Story