విరాట్ కోహ్లీ.. తన కెరీర్ లోనే అతి చెత్త ఫామ్ లో ఉన్నాడు. కోహ్లీ ఎప్పుడు తిరిగి ఫామ్ లోకి వస్తాడా అని అభిమానులు అందరూ ఎదురుచూస్తూ వస్తున్నారు. ఐపీఎల్ 2022 సీజన్ లో విరాట్ కోహ్లీ చెత్త ప్రదర్శన కంటిన్యూ అవుతోంది. ఆదివారం సన్ రైజర్స్ తో మ్యాచులో విరాట్ కోహ్లీ ఫస్ట్ బంతికే సుచిత్ బౌలింగ్ లో కేన్ విలియమ్సన్ కి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌటయ్యాడు. ఈ సీజన్ లో కోహ్లీకి ఇది మూడో గోల్డెన్ డకౌట్. ఐపీఎల్ 2022 సీజన్‌లో కోహ్లీ ఇలా మొదటి బంతికే పెవిలియన్‌కు వెళ్లడం ఇది మూడో సారి.
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్‌గా వచ్చిన కోహ్లీ దుష్మంత్ చమీరా బౌలింగ్‌లో క్యాచ్ రూపంలో వెనుదిరగగా.. సన్‌రైజర్స్‌పై ఆడిన చివరి మ్యాచ్‌లో జాన్సన్ బౌలింగ్‌లో క్యాచ్‌గానే అవుటయ్యాడు.. ఈరోజు మళ్లీ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సుచిత్ బౌలింగ్ విలియ్సన్‌కి క్యాచ్ ఇచ్చి పెవలియన్ చేరాడు. ఈ సీజన్ లో ఆడిన 12 మ్యాచుల్లో 19.63 సగటుతో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు కోహ్లీ. స్ట్రైక్ రేట్ 111.34. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఇప్పటివరకూ 2009 సీజన్‌లో 27.6 సగటుతో 359 పరుగులు చేయడమే విరాట్ అతి తక్కువ ప్రదర్శన. తర్వాతి మ్యాచ్ లలో కోహ్లీ పుంజుకోవాలని ప్రతి ఒక్క భారత్ క్రికెట్ అభిమాని ఆశిస్తూ వస్తున్నారు.
అయితే కోహ్లీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదనే విషయం అందరికీ తెలిసిందే..! ఇప్పటికే కోహ్లీ తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. కోహ్లి పరిస్థితిని అర్థం చేసుకున్న ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ డ్రెస్సింగ్ రూమ్‌లో అతడిని ఓదార్చాడు. తల నిమురుతూ మరేం పర్లేదు అన్నట్లుగా ఊరట కలిగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.