డబ్ల్యూపీఎల్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధన నిలిచింది. ఆమెను ఆర్సీబీ రూ.3.4 కోట్లకు దక్కించుకుంది. అయితే ఆమె పరుగులు చేయడంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఓపెనర్ గా వచ్చే మంధన ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేకపోయేది. దీంతో ఆమెను నమ్ముకున్న ఆర్సీబీ కష్టాల్లో పడుతూ వచ్చింది. ఆ ప్రభావం మొత్తం ఆమె జట్టు మీద పడింది. దీంతో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు కూడా చేరుకోలేకపోయింది.
డబ్ల్యూపీఎల్-2023లో స్మృతి మంధన సాధించిన పరుగుల ప్రకారం ఆమె ఒక్కో పరుగు విలువ రూ. 2. 28 లక్షలవుతుందని గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఈ సీజన్‌లో ఆమె ఆడిన 8 మ్యాచ్‌ల్లో 18.62 సగటున, 111.19 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 149 పరుగులు మాత్రమే చేసింది. మంధన అత్యధిక వ్యక్తిగత స్కోర్ (37) గుజరాత్ జెయింట్స్‌పై నమోదు చేసింది. ఆమె ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు స్పిన్నర్ల చేతిలో అవుట్ అయింది. ఖరీదైన ప్లేయర్ కాస్తా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.