లాస్ట్ బాల్ థ్రిల్‌.. కోహ్లీ సేన‌దే విక్ట‌రీ

RCB Beat Mumbai Indians. ఐపీఎల్‌ సీజన్‌-14లో బాగంగా తొలిమ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియన్స్

By Medi Samrat  Published on  10 April 2021 7:44 AM IST
లాస్ట్ బాల్ థ్రిల్‌.. కోహ్లీ సేన‌దే విక్ట‌రీ

ఐపీఎల్‌ సీజన్‌-14లో బాగంగా తొలిమ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మ‌ధ్య శుక్ర‌వారం జ‌రిగింది. ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజ్ బెంగళూరు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన బెంగుళూరు బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన‌ ముంబయి ఇండియన్స్ 20 ఓవ‌ర్ల‌లో 159 ప‌రుగులు చేసింది.‌ ముంబై ఆట‌గాళ్ల‌లో క్రిస్‌లిన్ 49, సూర్యకుమార్‌ యాదవ్ 31, ఇషన్ కిషన్ 28 ప‌రుగులు చేశారు. ఇక‌ బెంగళూరు బౌలర్లలో హ‌ర్షాల్ పటేల్ 5 వికెట్లు తీయ‌గా, వాషింగ్టన్ సుందర్, జెమిసన్ చెరో వికెట్ తీశారు.

అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇన్నింగ్స్ ను ఓపెనర్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ లు ప్రారంభించారు. వాషింగ్టన్ సుంద‌ర్ 10 పరుగుల వ‌ద్ద‌ ఆవుట్ కాగా.. విరాట్ కోహ్లీ 33 పరుగులు, గ్లెన్ మాక్స్ వెల్ 39 పరుగులు, ఏబీ డివిలియర్స్ 47 పరుగులు చేసి రాణించారు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జ‌ట్టు 8 వికెట్లను కోల్పోయి 160 పరుగులు చేసి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక‌ ముంబై బౌలర్ల‌లో బూమ్రా 2, జానే సన్స్ 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, బోల్ట్, కృనాల్ పాండ్య చెరో వికెట్ తీశారు.


Next Story