"రవీంద్ర పుష్ప".. తగ్గేదే లే.. నెట్టింట వైర‌ల్‌

Ravindra Jadeja Celebrates Wicket With Allu Arjun Move. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం శ్రీలంకతో జరిగిన మొద‌టి T20లో

By Medi Samrat  Published on  25 Feb 2022 11:50 AM IST
రవీంద్ర పుష్ప.. తగ్గేదే లే.. నెట్టింట వైర‌ల్‌

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం శ్రీలంకతో జరిగిన మొద‌టి T20లో భార‌త్ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. వికెట్ తీసిన తర్వాత ఇటీవల హిట్ మూవీ 'పుష్ప' నుండి నటుడు అల్లు అర్జున్ చేసిన పాపులర్ డ్యాన్స్ మూవ్‌ను అనుకరించాడు. గాయం కారణంగా కొంత‌కాలం ఆట‌కు దూరంగా ఉన్న జడేజా.. ఈ మ్యాచ్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తూ.. శ్రీలంక‌ ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లో దినేష్ చండిమాల్‌ను అవుట్ చేశాడు. అనంత‌రం పుష్ప సినిమాలోని 'శ్రీవల్లి' పాటలో అల్లు అర్జున్ డ్యాన్స్ మూవ్‌ను అనుక‌రించిన‌ జడేజా వికెట్ తీసిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.

జడేజా డ్యాన్స్ మూవ్‌ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ అతన్ని "రవీంద్ర పుష్ప" అని కూడా పేర్కొన్నాడు. జడేజా ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాను 1/28తో ముగించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌.. శ్రీలంకను 137/6కి పరిమితం చేసి 62 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మొద‌ట‌ బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌ 199/2 భారీ స్కోరు నమోదు చేసింది. భార‌త ఇన్నింగ్సులో ఇషాన్ కిషన్ 56 బంతుల్లో 89 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 28 బంతుల్లో 57 పరుగులతో రాణించడంతో భారత్.. శ్రీలంక‌కు భారీ ల‌క్ష్యాన్ని నిర్ధేశించింది.


Next Story