ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్‌గా అశ్విన్

Ravichandran Ashwin Wins ICC Men's Player Of The Month Award For February.ఫిబ్ర‌వ‌రి నెలకు గానూ ఐసీసీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2021 10:26 AM GMT
ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్‌గా అశ్విన్

ఫిబ్ర‌వ‌రి నెలకు గానూ ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ద మంత్ గా భార‌త ఆఫ్ స్పిన్న‌ర్ అశ్విన్ ఎంపిక‌య్యాడు. ఇంగ్లాండ్ ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో అశ్విన్ అద్భుతంగా రాణించాడు. బంతితోనే కాక బ్యాటింగ్‌లోనూ స‌త్తా చాటడంతో అశ్విన్‌ను ఈ అవార్డు వ‌రించింది. ఈ అవార్డ్‌ రేసులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌, విండీస్‌ ఆటగాడు కైల్‌ మేయర్స్‌ ఉన్నప్పటికీ ఆల్‌రౌండ్‌ ప్రతిభ కనబర్చిన అశ్విన్‌వైపే ఐసీసీ మొగ్గుచూపింది. సిరీస్‌లో మొత్తంలో 32 వికెట్లు తీసిన అశ్విన్‌.. చెన్నైలో జ‌రిగిన రెండో టెస్ట్‌లో సెంచ‌రీ కూడా చేశాడు. భార‌త జట్టు ఐసీసీ టెస్టు చాంఫియ‌న్ షిప్ ఫైన‌ల్‌కు క్వాలిపై అవడంతో అశ్విన్ కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ఐసీసీ ట్విట్ చేసింది.

ఒక సిరీస్‌లో 30కిపైగా వికెట్లు సాధించడం అశ్విన్‌కు ఇది రెండోసారి. అంతేకాదు ఈ ఫీట్‌ను సాధించిన ఏకైక ఇండియ‌న్ బౌల‌ర్‌ కూడా అశ్వినే కావడం విశేషం. ఈ ఏడాది నుంచే ఐసీసీ ఈ కొత్త అవార్డును ప్ర‌వేశ‌పెట్టింది. జ‌న‌వ‌రి నెల‌కుగాను టీమ్ఇండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో అద్భుతంగా రాణించడంతో పంత్.. ఈ అవార్డు గెలుచుకున్నాడు.


Next Story
Share it