ఆ ఆటగాళ్లను భారత జట్టులోకి తీసుకోవాలని అంటున్న రవిశాస్త్రి

Ravi Shastri handpicks 3 uncapped players to fight for a place in Team India's ODI squad at World Cup. ఐపీఎల్ తాజా సీజన్ లో ఆకట్టుకుంటున్న యువ ఆటగాళ్లకు భారత జట్టులో అవకాశం ఇవ్వాలని క్రికెట్ దిగ్గజం

By Medi Samrat  Published on  20 May 2023 5:00 AM GMT
ఆ ఆటగాళ్లను భారత జట్టులోకి తీసుకోవాలని అంటున్న రవిశాస్త్రి

ఐపీఎల్ తాజా సీజన్ లో ఆకట్టుకుంటున్న యువ ఆటగాళ్లకు భారత జట్టులో అవకాశం ఇవ్వాలని క్రికెట్ దిగ్గజం, వ్యాఖ్యాత రవిశాస్త్రి తెలిపారు. వారు ఈ ఏడాది భారత్ లో జరిగే వరల్డ్ కప్ కు టీమిండియాలో చోటు దక్కించుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు యశస్వి జైస్వాల్, కోల్ కతా నైట్ రైడర్స్ హార్డ్ హిట్టర్ రింకూ సింగ్ లను రవిశాస్త్రి ప్రశంసించారు. జైస్వాల్ ఈ సీజన్ లో ప్రదర్శిస్తున్న ఆటతీరుకు గతేడాది ఆడిన ఆటకు ఏమాత్రం పోలికలేదని.. ఎంతో మెరుగయ్యాడని ప్రశంసించారు. రింకూ సింగ్ టెంపర్ మెంట్ అమోఘం. జైస్వాల్, రింకూ అత్యంత కఠిన నేపథ్యాల నుంచి వచ్చినవారే. ఆట కోసం వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. వారికి ఏదీ సులభంగా లభించలేదని రవి శాస్త్రి అన్నారు. తెలుగుతేజం తిలక్ వర్మ, పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జితేశ్ శర్మ, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్ ల ఆటతీరును కూడా ప్రస్తావించారు. వీళ్లందరూ ఫామ్ లో ఉంటే వరల్డ్ కప్ లో ఆడే టీమిండియాకు ఎంపికయ్యేందుకు అర్హులేనని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. టీమిండియా ప్రధాన ఆటగాళ్లలో ఎవరైనా గాయపడితే మరో ఆలోచన లేకుండా ఈ యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవచ్చని తెలిపారు. చూద్దాం.. రవి శాస్త్రి అభిప్రాయాలను బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటారో లేదో..!


Next Story