రాజస్థాన్‌ రాయల్స్‌ సంచలన నిర్ణయం.. ఇక‌పై అత‌డే అన్ని..

Rajasthan Royals' Head Coach Andrew McDonald Steps Down. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ సంచలన నిర్ణయం తీసుకున్నది

By Medi Samrat  Published on  21 Feb 2021 7:36 PM IST
రాజస్థాన్‌ రాయల్స్‌ సంచలన నిర్ణయం.. ఇక‌పై అత‌డే అన్ని..

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ సంచలన నిర్ణయం తీసుకున్నది. వ‌చ్చే సీజ‌న్‌పై దృష్టిపెట్టిన రాయ‌ల్స్ యాజ‌మాన్యం ప్ర‌క్షాళ‌న మొద‌లెట్టింది. వేలానికి ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెట్‌ డైరెక్టర్‌గా శ్రీలంక‌ మాజీ క్రికెటర్‌ కుమార సంగక్కరను నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆ జట్టు ప్రధాన కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను తొలగించినట్లు ఆదివారం ప్రకటించింది.


అంతేకాదు భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్నీని సహాయ కోచ్‌గా నియమించింది. ఇక‌పై అత‌డు సంగక్కరతో కలిసి పనిచేస్తాడని ఫ్రాంఛైజీ పేర్కొంది. ఈ మేర‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ట్వీట్ చేసింది. ప్ర‌‌స్తుతం టీమ్‌కు సంబంధించిన అన్ని వ్యవహారాలను సంగక్కర పర్యవేక్షిస్తున్నాడు. వేలానికి ముందు స్మిత్‌ను కాద‌ని రాజస్థాన్ నూత‌న‌ కెప్టెన్‌గా యువ ఆటగాడు సంజు శాంసన్‌ను ఎంపిక చేసింది. రానున్న సీజ‌న్‌లో స్పిన్‌ బౌలింగ్ కోచ్‌గా‌ సాయిరాజ్‌ బహతులే, ఫాస్ట్‌ బౌలింగ్ కోచ్‌గా‌ రాబ్‌ అసీల్, ‌ఫీల్డింగ్ కోచ్‌గా‌ దిశాంత్‌ యాగ్నిక్ సేవ‌లందించ‌నున్నారు.


Next Story