ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలం మొదటి రోజు బెంగళూరులో ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ లు ఉండగా.. రెండు కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ వీటికి జతగా చేరనున్నాయి. కోచ్‌లు, సపోర్టు స్టాఫ్‌లు, స్కౌట్‌లు, కొంతమంది కెప్టెన్‌లు కూడా ఈరోజు ప్రారంభమై రెండు రోజుల పాటు జరిగే IPL-2022 వేలంలో వార్‌లో పాల్గొంటారు. టోర్నమెంట్ 15వ ఎడిషన్ మార్చి నెలాఖరులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మొదటగా వేలంలో టీమిండియా గబ్బర్‌గా పేరొందిన శిఖర్ ధావన్‌ను పంజాబ్ కింగ్స్ జట్టు 8.25 కోట్లకు దక్కించుకుంది. శిఖర్‌ను దక్కించుకోవడం కోసం ఢిల్లీ క్యాపిటల్స్ చివరి వరకూ పంజాబ్ కింగ్స్ తో వేలంలో ఫోటీ పడింది. అనంతరం టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వేలంలో ఉంచగా.. రాజస్థాన్ రాయల్స్ అతనిని 5 కోట్లకు దక్కించుకుంది. తరువాత గత వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఫ్యాట్ కమ్మిన్స్ ఈ వేలంలో అదృష్టం పరిక్షించుకున్నాడు. కేకేఆర్ 7.75 కోట్లకు దక్కించుకుంది. గత సంవత్సరం దక్కించుకున్న ధరలో సగానికి అమ్ముడుపోయాడు ఫ్యాట్ కమ్మిన్స్.