ఏప్రిల్ 19న జైపూర్ వేదికగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్స్ అయినట్లు రాజస్తాన్ క్రికెట్ సంఘం అడ్‌హక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ సంచలన ఆరోపణలు చేశారు. సులువుగా గెలిచే మ్యాచ్‌లో రాజస్తాన్ ఉద్దేశపూర్వకంగా ఓడిపోయిందంటూ బిహానీ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఆరోపణలపై రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం స్పందించింది. తమపై చేస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తమని రాయల్స్ ఫ్రాంచైజీ సీనియర్ అధికారి దీప్ రాయ్ ఖండించారు. అన్ని ఆరోపణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, బహిరంగంగా చేసే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు తప్పుదారి పట్టించడమే కాకుండా రాజస్థాన్ రాయల్స్, రాయల్ మల్టీ స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్, బీసీసీఐ విశ్వసనీయతకు తీవ్ర నష్టం కలిగించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహానీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజస్థాన్ ముఖ్యమంత్రి, క్రీడా మంత్రి, క్రీడా కార్యదర్శికి రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం లేఖ రాసింది.