ఇంటివాడు కాబోతున్న స్టార్ ఆల్‌రౌండ‌ర్‌

Rahul Tewatia Gets Engaged. ఇండియ‌న్ క్రికెట‌ర్స్ వ‌రుస‌గా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పెళ్లి పీట‌లెక్కుతున్నారు, ఆల్‌రౌండ‌ర్ రాహుల్ తెవాటియా కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

By Medi Samrat  Published on  5 Feb 2021 3:19 AM GMT
Rahul Tewatia Gets Engaged

ఇండియ‌న్ క్రికెట‌ర్స్ వ‌రుస‌గా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పెళ్లి పీట‌లెక్కుతున్నారు. మొన్న‌టికి మొన్న‌ భార‌త ఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ వివాహం చేసుకోగా.. రీసెంట్‌గా టీమ్‌ఇండియా పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్ పెళ్లి బాజా మోగించాడు. ఫిబ్రవరి 2న కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో రినీ మెడలో మూడుముళ్లు వేశాడు.


తాజాగా ఐపీఎల్‌లో రాణించిన‌ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఆల్‌రౌండ‌ర్ రాహుల్ తెవాటియా కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బుధ‌వారం రోజు ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రుపుకున్నాడు. ఆ వేడుక సంబంధించిన ఫొటోల‌ను తాజాగా సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ జంట‌కు నెటిజ‌న్స్‌తో పాటు ప‌లువురు క్రికెట‌ర్స్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.


Next Story
Share it