ఆ రెండు మ్యాచ్‌లు రాహుల్ ఆడడు.. బాంబ్ పేల్చిన కోచ్ ద్రవిడ్
ఆసియా కప్ కోసం శ్రీలంకకు బయలుదేరే ముందు, భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్..
By Medi Samrat Published on 29 Aug 2023 3:45 PM ISTఆసియా కప్ కోసం శ్రీలంకకు బయలుదేరే ముందు, భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్.. KL రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌ల ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ ఇచ్చారు. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌ల ఫిట్‌నెస్ పట్ల తాను సంతోషంగా ఉన్నానని ద్రావిడ్ చెప్పాడు. శిక్షణ శిబిరంలో ఇద్దరు ఆటగాళ్లు బాగా బ్యాటింగ్ చేశారు. ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్ ఆడడని ద్రవిడ్ తెలిపాడు. భారత్ తొలి రెండు మ్యాచ్‌లు సెప్టెంబర్ 2న పాకిస్థాన్‌తో, 4న నేపాల్‌తో తలపడనుంది. రెండు మ్యాచ్‌లు క్యాండీలో జరగనున్నాయి. అంటే రాహుల్ గ్రూప్ రౌండ్‌లో ఆడడం లేదు. ఒకవేళ టీమ్ ఇండియా సూపర్-4కి చేరితే రంగంలోకి దిగుతాడు.
రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. "కేఎల్ రాహుల్ బాగా బ్యాటింగ్ చేశాడు. వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి తీసుకుంటాడు. మేము దీని గురించి పెద్దగా చింతించమన్నారు. నాల్గవ స్థానం, ఐదవ నంబర్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. గత 18 నెలలుగా ఈ ఆర్డర్ కోసం ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్. రెండు నెలల్లో ముగ్గురు ఆటగాళ్లు గాయపడడం దురదృష్టకరం. కాబట్టి మేము ప్రయోగాలు చేస్తూనే ఉండవలసి వచ్చింది. ముగ్గురికి శస్త్రచికిత్స కూడా జరిగింది. కాబట్టి మేము వేర్వేరు ఆటగాళ్లను ఉపయోగించాము. మేము ప్రపంచకప్‌కు సిద్ధంగా ఉండాలి. ప్రపంచకప్‌లో ఏం జరుగుతుందో తెలియదు. అందుకే ఆర్డర్‌లో ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లకు నిరంతర అవకాశాలు ఇచ్చాం. కీలక ఆటగాళ్లు లేనప్పుడు,ఇతరులకు అవకాశం ఇవ్వాలని అన్నాడు.
గత కొన్నేళ్లుగా భారత జట్టుకు చాలా మంది కెప్టెన్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా పరిమిత ఓవర్లలో కెప్టెన్లుగా ఉన్నారు. వీరిలో ధావన్, పంత్‌లు ఆసియా కప్ జట్టులో లేరు. దీనిపై ప్రధాన కోచ్ మాట్లాడుతూ.. “మా జట్టులో చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. ఇంతకు ముందు కొందరు ఆటగాళ్లు కెప్టెన్లుగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొందరు కెప్టెన్లుగా ఉన్నారు. ప్రస్తుత కాలంలో ఎక్కువ క్రికెట్ జరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. మేము పర్యటిస్తున్నాము. గ్రూప్‌లో అందరికీ అనుభవం ఉంటే మంచిది. తుది నిర్ణయం రోహిత్ శర్మదేనన్నాడు. ప్రపంచ కప్ స్వదేశంలో జరగనుండటం చాలా బాగుంది. ప్రేక్షకుల నుంచి ఒత్తిడి ఉంటుందన్నారు.