బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వేల్త్ గేమ్స్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు బంగారు పతకం సాధించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో విజయం సాధించింది. కెనడా బ్యాడ్మింటన్ మిచ్చెల్ లీతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో 21 - 15, 21 - 12 స్కోర్‌తో విక్టరీ కొట్టింది. తొలి గేమ్‌లో సింధు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అన్ని రకాల షాట్లను ఆడి .. ప్రత్యర్థిని ముప్పుతిప్పులు పెట్టింది. మిచ్చెలి లీ ప్రపంచ నెంబర్ 14వ ర్యాంక్ కాగా, సింధు వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్న విషయం తెలిసిందే.
ఈ క్రీడల్లో పీవీ సింధుకు ఇదే మొదటి స్వర్ణం. అంతకుముందు 2014లో జరిగిన కామన్‌వేల్త్ గేమ్స్‌లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజతం సాధించింది. ఈ స్వర్ణంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 56 పతకాలు సాధించింది. అందులో 19 స్వర్ణాలు ఉండగా 15 రజతాలు, 22 కాంస్యాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది.