పతకం దిశగా అడుగులు.. క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు
PV Sindhu enters in Quarters in Olympics.ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యమే బరిలోకి దిగిన భారత స్టార్ షెట్లర్, తెలుగు తేజం
By తోట వంశీ కుమార్ Published on
29 July 2021 2:11 AM GMT

ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యమే బరిలోకి దిగిన భారత స్టార్ షెట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మరో అడుగు ముందుకు వేసింది. మహిళ సింగిల్స్ గ్రూప్-జేలో వరుసగా మూడు విజయాలు సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గురువారం ఉదయం డెన్మార్క్ షెట్లర్ మియా బ్లిక్‌ఫెల్ట్‌తో జరిగిన ప్రీక్వార్టర్స్‌లో వరుస గేమ్‌లలో 21-15, 21-13తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సింధు స్పష్టమైన ఆదిపత్యం కనబరిచింది. మొత్తం 40 నిమిషాల పాటు జరిగిన ఈమ్యాచ్‌లో ప్రత్యర్థి కోలుకోవడానికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. కాగా.. క్వార్టర్ ఫైనల్‌లో గెలిస్తే కాంస్యం సాధించే అవకాశం ఉంది.
టోక్యో ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్
ఉ.5.30కి మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్
ఉ.6 గంటలకు హాకీ: భారత్ Vs అర్జెంటీనా
ఉ.6.15కి పీవీ సింధు ప్రీ క్వార్టర్స్ మ్యాచ్
ఉ.7.30కి ఆర్చరీ పురుషుల వ్యక్తిగత విభాగం(అతానుదాస్)
ఉ.8.48కి బాక్సింగ్ 91 కిలోల విభాగం(సతీష్‌కుమార్)
మ.3.36కి మేరీకోమ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్
Next Story