ప్రేమ గీతానికి డ్యాన్స్ చేసిన బ్యాడ్మింట‌న్ స్టార్‌.. వీడియో వైర‌ల్‌

PV Sindhu Dance goes Viral on social media.ప్ర‌ముఖ‌ బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు డ్యాన్స్ చేసిన వీడియో ప్ర‌స్తుతం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Nov 2021 7:18 AM GMT
ప్రేమ గీతానికి డ్యాన్స్ చేసిన బ్యాడ్మింట‌న్ స్టార్‌.. వీడియో వైర‌ల్‌

ప్ర‌ముఖ‌ బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు డ్యాన్స్ చేసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నిత్యం ప్రాక్టీస్, టోర్న‌మెంట్లు అంటూ బిజీగా ఉండే సింధు సాంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి నృత్యం చేసిన వీడియోను షేర్ చేసింది. గ్రీన్‌ లెహంగాలో 'లవ్ న్వాంటిటి' పాటకు త‌న‌దైన స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టింది ఈ హైదరాబాదీ బ్యాడ్మింటన్‌ స్టార్‌. దీపావ‌ళి సంద‌ర్భంగా జరుపుకున్న వేడుకలో ఈ వీడియో తీయగా.. తాజాగా ఆమె తన ఇనస్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కేవ‌లం ఒక్క రోజులోనే ఈ వీడియో మిలియ‌న్‌కు పైగా వ్యూస్‌ను ద‌క్కించుకుంది. దీనిపై అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. సోమ‌వారం సింధు రాష్ట్రప‌తి చేతుల మీదుగా భార‌త‌దేశ‌పు మూడో అత్యున్న‌త పౌర పుర‌స్కారం అందుకుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా తదితరుల సమక్షంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సింధును పద్మభూషణ్‌తో సత్కరించారు. 2015లో ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకున్న సింధు 2016లో ఖేల్ రత్న అవార్డు కూడా సాధించింది. తాజాగా ఆమె ప‌ద్మ‌భూష‌ణ్‌ అవార్డును అందుకుంది. 2020 సంవ‌త్సరానికి గాను ఈ అవార్డు ఆమెను వ‌రించింది.

2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో సిల్వర్‌ పతకం గెలుచుకున్న తొలి మ‌హిళ రికార్డు సృష్టించిన పీవీ సింధు. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కూడా బ్రాంజ్ మెడ‌ల్ సాధించింది. ఇక 2019లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఈ హైద‌రాబాదీ స్టార్ షెట్ల‌ర్‌.. అంతకుముందు వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీల్లో రెండు కాంస్యాలు, రెండు రజతాలు సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఎక్కువ పతకాలు సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

Next Story
Share it