పీవీ సింధు శుభారంభం

PV Sindhu beats Ksenia Polikarpova.టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళా స్టార్ షట్లర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 July 2021 2:52 AM GMT
పీవీ సింధు శుభారంభం

టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళా స్టార్ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు శుభారంభం చేసింది. త‌న తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన క్సేనియా పోలికార్పోవాపై విజ‌యం సాధించింది. 27-7, 21-10తో వరుస సెట్లు గెలిచి మ్యాచ్‌ను కైవ‌సం చేసుకుంది. ఈ మ్యాచ్ 29 నిమిషాల్లో ముగియ‌డం విశేషం.

ఇదిలా ఉంటే.. మ‌హిళ‌ల 10మీట‌ర‌ల్ ఎయిర్ పిస్ట‌ల్ విభాగంలో భార‌త్‌కు నిరాశ ఎదురైంది. స్టార్‌ షూటర్లు మను బాకర్, యశస్విని దేస్వాల్ టాప్-8కు అర్హత సాధించలేకపోయారు. దీంతో పతకం లేకుండానే ఇద్దరు నిష్క్రమించారు. మను బాకర్‌ 12వ స్థానంలో, యశస్విని 13 స్థానంలో నిలిచారు.

ఆదివారం బ్యాడ్మింటన్‌తోపాటు 12 విభాగాల్లో భారత క్రీడాకారులు పోటీపడనున్నారు.

ఉ.6:30కి జిమ్నాస్టిక్స్‌ మహిళల ఆల్‌రౌండ్‌ క్వాలిఫికేషన్‌

ఉ.6:30కి రోయింగ్‌ లైట్‌వెయిట్‌ డబుల్స్‌ స్కల్స్‌ రెపిచేజ్‌

ఉ.6:30కి షూటింగ్‌ పురుషుల స్కీట్‌ క్వాలిఫికేషన్‌ (బజ్వా, మీరజ్‌)

ఉ.7:10కి బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ (పీవీ సింధు)

ఉ.9:30కి షూటింగ్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ క్వాలిఫికేషన్‌

ఉ.10:30కి టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌

ఉ.10:30కి టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌

మ.1:30కి బాక్సింగ్‌ మహిళల ఫ్లైవెయిట్‌ (మేరీకోమ్‌ రౌండ్‌ఆఫ్‌ 32)

మ.3 గంటలకు భారత్‌ Vs ఆస్ట్రేలియా హాకీ మ్యాచ్‌

మ.3:30కి స్విమ్మింగ్‌ మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ హీట్స్‌ (మానా పటేల్‌)

మ.3:30కి స్విమ్మింగ్‌ పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టైల్‌ హీట్స్‌ (సాజన్‌ ప్రకాశ్‌)

సా.4:20కి స్విమ్మింగ్‌ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ హీట్స్‌ (శ్రీహరి నటరాజ్‌)

Next Story