ప్రిక్వార్టర్స్‌లో పీవీ సింధు
PV Sindhu beat Cheung NY.ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన దిగిన భారత స్టార్ షట్లర్ పీవీ
By తోట వంశీ కుమార్ Published on 28 July 2021 8:50 AM ISTఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన దిగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో అడుగు ముందుకు వేసింది. గ్రూఫ్ జెలో భాగంగా హాంకాంగ్‌కు చెందిన చియాంగ్ ఎన్‌గన్ యితో జరిగిన మ్యాచ్‌లో 21-9, 21-16తో వరుస గేముల్లో ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. తొలి గేమ్‌ను 15 నిమిషాల్లోనే సునాయాసంగా గెలిచింది సింధు. అయితే.. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. 14 పాయింట్ల వరకూ ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఆ సమయంలో పుంజుకున్న సింధు వరుస పాయింట్లు సాధించి సెట్‌తో పాటు గేమ్‌ను గెలిచింది. దీంతో గ్రూప్ జే టాపర్‌గా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.
నేటి ఒలింపిక్స్‌లో భారత షెడ్యూల్:
ఉదయం 6.30కి మహిళల హాకీ (భారత్ Vs గ్రేట్ బ్రిటన్)
ఉ.7.30కి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్(సింధు Vs యి చియాంగ్)
ఉ.7.30కి ఆర్చరీ వ్యక్తిగత విభాగం(తరుణ్ దీప్‌రాయ్)
ఉదయం 8 గంటలకు రోయింగ్, 8.35 గంటలకు- సెయిలింగ్
మ.12.30కి ఆర్చరీ వ్యక్తిగత విభాగం(ప్రవీణ్ జాదవ్)
మ.2.14కి ఆర్చరీ వ్యక్తిగత విభాగం(దీపికా కుమారి)
మ.2.30కి బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్(సాయిప్రణీత్)
మ.2.33 గంటలకు మహిళల బాక్సింగ్(పూజారాణి)
టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా బ్రిటన్‌తో జరిగిన పూల్ ఏ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు ఓటమి పాలైంది. తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన గ్రేట్ బ్రిటన్ 4-1 తేడాతో భారత మహిళల జట్టును చిత్తుగా ఓడించింది. దీంతో ఆడిన మూడు మ్యాచ్‌లు ఓడడంతో భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్స్‌కు చేరే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. భారత మహిళల జట్టు తమకు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవడంతో పాటు ప్రత్యర్థి జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక గ్రేట్ బ్రిటన్ తరపున మార్టిన్ హెచ్ ఆట 2, 19వ నిమిషంలో, ఎల్ ఓస్లే 41వ నిమిషంలో, బాల్స్‌డన్ 57వ నిమిషంలో గోల్స్ చేయగా.. భారత్ తరపున ఎస్ దేవి ఆట 7వ నిమిషంలో గోల్ చేసింది.