'ఇలా అయితే పంజాబ్ ట్రోఫీ గెలవదు'.. రికీ పాంటింగ్‌పై టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

ఐపీఎల్ 2025 టైటిల్‌ను పంజాబ్ కింగ్స్ గెలవలేద‌ని భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు.

By Medi Samrat
Published on : 27 April 2025 12:31 PM IST

ఇలా అయితే పంజాబ్ ట్రోఫీ గెలవదు.. రికీ పాంటింగ్‌పై టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

ఐపీఎల్ 2025 టైటిల్‌ను పంజాబ్ కింగ్స్ గెలవలేద‌ని భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాట్స్‌మెన్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు. ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌పై కూడా అతడు పెద్ద ఆరోపణ చేశాడు. పాంటింగ్ విదేశీ ఆటగాళ్లకు ప‌దేప‌దే అవకాశాలు కల్పిస్తున్నాడని తివారీ అన్నాడు.

IPL 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ల అద్భుతమైన ఆరంభం తర్వాత గ్లెన్ మాక్స్‌వెల్‌ను నంబర్-4లో, మార్కో జెన్సన్‌ను నంబర్-5లో పంపాలని పంజాబ్ నిర్ణయించింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పుల కారణంగా నెహాల్ వధేరా, శశాంక్ సింగ్ వంటి ఆట‌గాళ్లు లోయ‌ర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాల్సివుంటుంద‌ని.. అది జ‌ట్టుపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

పాంటింగ్ విదేశీ బ్యాట్స్‌మెన్‌పై విశ్వాసం వ్యక్తం చేశారని.. యువ భారత స్టార్ ఆటగాళ్లపై కాదని తివారీ చెప్పాడు. పాంటింగ్ యొక్క ఈ ప్రణాళిక జట్టుకు భారంగా ఉంటుందని మనోజ్ తివారీ అన్నాడు. భారత ఆటగాళ్లపై ఆత్మవిశ్వాసం చూపకపోతే ఈ ఏడాది పీబీకేఎస్ టైటిల్ గెలవలేద‌ని అన్నాడు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేశాడు.

కేకేఆర్, పంజాబ్ మధ్య మ్యాచ్‌ను వర్షం చెడగొట్టింది. శనివారం ఏప్రిల్ 26న‌ కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య IPL మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. ప్రభసిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య అద్భుత అర్ధ సెంచరీలతో ఘన ప్రారంభానికి పునాది వేశారు, అయితే KKR డెత్ ఓవర్లలో పునరాగమనం చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.

జ‌వాబుగా KKR ఎటువంటి నష్టం లేకుండా ఒక ఓవర్‌లో ఏడు పరుగులు చేసింది, రాత్రి 9.35 గంటలకు అకస్మాత్తుగా వ‌ర్షం వచ్చింది. దీంతో ఆట ర‌ద్దైంది. గ్రౌండ్ సిబ్బంది వెంటనే పిచ్‌ను కప్పి ఉంచారు. దాదాపు 90 నిమిషాల నిరీక్షణ తర్వాత వాతావరణంలో ఎలాంటి మెరుగుదల లేకపోవడంతో రాత్రి 10.58 గంటలకు రిఫరీ మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్‌ దక్కింది.

Next Story