పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ.. అద‌ర‌హో

Punjab Kings Unveil New Jersey. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 14వ‌సీజ‌న్‌(ఐపీఎల్ 2021) పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీల‌ను విడుద‌ల.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 March 2021 10:27 AM GMT
Punjab Kings Unveil New Jersey

ఏప్రిల్ 9 నుంచి ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 14వ‌సీజ‌న్‌(ఐపీఎల్ 2021) మొద‌లుకానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్ కోసం అన్ని ఫ్రాంచైజీలు సిద్దం అవుతున్నాయి. ఇప్ప‌టికే కొన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ మొద‌లెట్ట‌గా.. మ‌రికొన్ని ప్రాంచైజీలు మ‌రో రెండు మూడు రోజుల్లో ప్రాక్టీస్ మొద‌లెట్టేందుకు సిద్దం అవుతున్నాయి. ఇటీవ‌ల ముగిసిన మినీ వేలంలో త‌మ‌కు కావాల్సిన ఆట‌గాళ్ల‌ను సొంతం చేసుకున్న ప్రాంచైజీలు ఈ సారి స‌రికొత్త‌గా స‌న్న‌ద్దం అవుతున్నాయి. ఇప్ప‌టికే ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్‌కింగ్స్ జ‌ట్లు త‌మ కొత్త జెర్సీల‌ను విడుద‌ల చేయ‌గా.. తాజాగా పంజాబ్ కింగ్స్ సైతం అదే బాట‌లో ప‌య‌నించింది.

ఐపీఎల్ 13వ సీజ‌న్ లో 6వ స్థానంలో నిలిచింది కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్‌. ఆ సీజ‌న్ ముగిసిన కొద్ది రోజుల త‌రువాత త‌మ జ‌ట్టు పేరును పంజాబ్ కింగ్స్‌గా మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు సరికొత్త డిజైన్‌తో రూపొందించిన జెర్సీని మంగళవారం విడుదల చేసింది. ఈసారి కొత్తగా గోల్డెన్‌ స్ట్రిప్‌లతో రెడ్‌ జెర్సీని తయారు చేశారు. కేకేఆర్(కోల్‌క‌త్తా నైట్‌రైడ‌ర్స్‌)‌, ఆర్‌సీబీ(రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ ఆప్ బెంగ‌ళూరు) తర్వాత గోల్డెన్‌ కలర్‌ హెల్మెట్లను వినియోగించనున్న మూడో జట్టు పంజాబే. ఇక పేరు మార్పుతో పాటు జెర్సీ మార్చిన పంజాబ్‌కు ఈ సారైన అదృష్టం క‌లిసి వ‌స్తుందో లేదో చూడాలి మ‌రీ. పంజాబ్ త‌న తొలి మ్యాచ్ ను ముంబై వేదికగా ఏప్రిల్‌ 12న రాజస్థాన్‌ రాయల్స్ తో ఆడ‌నుంది.

Next Story
Share it