టైటాన్స్ జైత్రయాత్రకు పంజాబ్ బ్రేక్
Punjab beat Gujarat by 8 wickets.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకువెలుతున్న
By తోట వంశీ కుమార్ Published on 4 May 2022 3:30 AM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకువెలుతున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు బ్రేక్ పడింది. బంతితో, బ్యాటుతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో టైటాన్స్ ను చిత్తు చేసింది. గత మ్యాచ్‌లో తమకు ఎదురైన ఓటమికి గుజరాత్‌పై పంజాబ్ ప్రతీకారం తీర్చుకుంది.దీంతో పది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో పంజాబ్ ఐదో స్థానానికి చేరుకుంది.
టాస్ గెలిచిన హార్థిక్ పాండ్య బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతడి నిర్ణయం తప్పని తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. రబాడ(4/33) విజృంభించడంతో టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 143/8 స్కోరుకు పరిమితమైంది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్(65 నాటౌట్; 50 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా.. గిల్(9), కెప్టెన్ హార్దిక్ పాండ్య(1), మిల్లర్ (11), తెవాటియా (11), రషీద్‌ఖాన్(0) ఘోరంగా విఫలం అయ్యారు.
అనంతరం లక్ష్యాన్ని పంజాబ్ మరో నాలుగు ఓవర్లు మిగిలిఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. 16 ఓవర్లలో 145/2 స్కోరు చేసింది. ఓపెనర్ ధావన్ (62 నాటౌట్; 53 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగా.. భానుక రాజపక్స(40; 28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్), లివింగ్‌స్టోన్ (30 నాటౌట్; 10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచికొట్టారు. టైటాన్స్ బౌలర్లలో షమీ, ఫెర్గూసన్ ఒక్కో వికెట్ తీశారు. రబాడకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.