అశ్విన్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం.. ఏకంగా 10 మందికి

Prithi shocking tweet reveals tested 10 members positive.టీమ్ఇండియా ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ కుటుంబంలో క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 May 2021 3:00 AM GMT
అశ్విన్ ఇంట్లో క‌రోనా క‌ల‌క‌లం.. ఏకంగా 10 మందికి

టీమ్ఇండియా ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ కుటుంబంలో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించింది. ఆయ‌న కుటుంబంలోని 10 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. ఈ విష‌యాన్ని అశ్విన్ స‌తీమ‌ణి ప్రీతి నారాయణన్ వెల్ల‌డించారు. శుక్రవారం టెస్టులు నిర్వహించుకోగా.. వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని ట్వీట్‌ చేసింది.

'ఒకే వారంలో ఇంట్లోని ఆరుగురు పెద్దవారికి, నలుగురు పిల్లలకు పాజిటివ్‌గా తేలింది. పిల్లల కారణంగా అందరికీ వైరస్‌ వ్యాపించింది. కుటుంబంలోని అందరూ వేర్వేరు ఇళ్లలో, ఆసుపత్రుల్లో చేరడంతో గతవారం ఓ పీడకలలా గడిచింది. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. టీకా తీసుకోండి' అని ప్రీతి ట్వీట్లలో సూచించింది.

ఇదిలా ఉంటే.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో అశ్విన్.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. త‌న ఇంట్లో క‌రోనా క‌లకలం రేగ‌డంతో గ‌త వారం అశ్విన్ అర్థాంత‌రంగా ఈ లీగ్ నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. క‌రోనాతో యుద్దం చేసుకున్న ఈ క్లిష్ట స‌మ‌యాల్లో కుటుంబానికి అండ‌గా ఉండాల‌నే.. ఐపీఎల్ నుంచి బ్రేక్ తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు అశ్విన్‌.


Next Story
Share it