పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. హైజంప్‌లో రజతం
Praveen Kumar wins Silver medal in Tokyo Paralympics.టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత క్రీడాకారులు
By తోట వంశీ కుమార్ Published on
3 Sep 2021 6:34 AM GMT

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మరో పతకం భారత్ ఖాతాలో చేరింది. పురుషుల హైజంప్‌లో ప్రవీణ్‌కుమార్ రజక పతకాన్ని సాధించాడు. హైజంప్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం. భారత్ ఖాతాలో మొత్తం 11 పతకాలు ఉన్నాయి. వీటిలో రెండు స్వర్ణ(అవని లెఖారా, సుమిత్), ఆరు రజత(ప్రవీణ్ కుమార్, మరియప్ప తంగవేల్, దేవేంద్ర ఝజారియా, యోగేష్ కథునియా, నిషద్ కుమార్, భవీనాబెన్ పటేల్), మూడు కాంస్య(శరద్ కుమార్, సిఘ్రాజ్ అధనా, సుందర్ సింగ్ గుర్జర్) పతకాలు ఉన్నాయి.
నేడు(శుక్రవారం) జరిగిన టీ64 హైజంప్ లో ప్రవీణ్ కుమార్ అద్భుతం చేశారు. 2.07 మీటర్ల జంప్ చేసి రజత పతకం సాధించాడు. అంతేకాదు సరికొత్త ఆసియన్ రికార్డును కూడా నెలకొల్పాడు. 2.10 మీటర్ల జంప్ తో బ్రిటన్ కు చెందిన జొనాథన్ ఎడ్వర్డ్స్ స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఇక పోలాండ్‌కు చెందిన మసీజ్ లెపియాటోకు బ్రోన్జ్ మెడల్ దక్కింది. కాగా.. భారత బృందంలో అత్యంత పిన్నవయసులోనే(18ఏళ్లు) పతకం అందుకున్నది ప్రవీణ్ కుమార్ కావడం విశేషం.
Next Story