ధోని సీక్రెట్ ఒకటి బయటకు వచ్చిందిగా..
Pragyan Ojha reveals MS Dhoni secrets. తాజాగా మహేంద్ర సింగ్ ధోనికి చెందిన ఓ సీక్రెట్ ను ప్రగ్యాన్ ఓజా బయటపెట్టాడు.
By Medi Samrat
క్రికెటర్లలో చాలా మందికి కొన్ని కొన్ని మూఢ నమ్మకాలు ఉంటాయి. సచిన్ టెండూల్కర్ దగ్గర నుండి ఎంతో మంది ఆటగాళ్లకు సంబంధించిన సీక్రెట్స్ అప్పుడప్పుడు బయటకు వచ్చాయి. తాజాగా మహేంద్ర సింగ్ ధోనికి చెందిన ఓ సీక్రెట్ ను ప్రగ్యాన్ ఓజా బయటపెట్టాడు. ధోని మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకు ఎలాంటి గుడ్‌లక్ చెప్పడట..! అలా చెప్పడమే ధోని మానేశాడని ఓజా తెలిపాడు. ధోని మ్యాచ్‌కు ముందు తన జట్టులోని ఆటగాళ్లకు గుడ్‌లక్ లేదా ఆల్ ది బెస్ట్ చెబితే మ్యాచ్ తర్వాత ఏదో ఒకటి తనకు వ్యతిరేకంగా జరిగేదట.. దీంతో ధోని ఆల్ ది బెస్ట్ చెప్పడం కూడా మానేశాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా మ్యాచ్‌కు ముందు ధోని దగ్గరకి వెళ్లడానికి ఆలోచిస్తారని.. ధోనినే ఈ విషయాన్ని గతంలో చెప్పాడట. తనకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయని.. వాటిని బలంగా నమ్ముతానని.. అందుకే మ్యాచ్‌కు ముందు నా జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పనని ధోని బయటపెట్టాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను కూడా ఎలాంటి విషెస్ చెప్పాలని కోరుకోడట ధోని.
మహేంద్ర సింగ్ ధోని కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ధోని తల్లి దేవకి, తండ్రి పాన్‌సింగ్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరు రాంచీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ధోని ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్)లో ఆడుతున్నాడు.. ధోని సారథ్యంలోని చెన్నై జట్టు మూడు మ్యాచులు ఆడగా.. రెండింటిలో గెలిచి ఓ మ్యాచ్‌లో ఓడింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్న ఆ జట్టు నేడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.