మ‌రోసారి వార్తల్లో ప్ర‌జ్ఞానంద

Praggnanandhaa beat Carlsen. ఇండియ‌న్ గ్రాండ్‌మాస్ట‌ర్ ఆర్ ప్ర‌జ్ఞానంద మ‌రోసారి వార్తల్లో నిలిచాడు.

By Medi Samrat  Published on  22 Aug 2022 3:00 PM GMT
మ‌రోసారి వార్తల్లో ప్ర‌జ్ఞానంద

ఇండియ‌న్ గ్రాండ్‌మాస్ట‌ర్ ఆర్ ప్ర‌జ్ఞానంద మ‌రోసారి వార్తల్లో నిలిచాడు. ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో క‌ప్ టోర్నీలో వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ మాగ్న‌స్ కార్ల్‌స‌న్ పై 17 ఏళ్ల ప్ర‌జ్ఞానంద విజ‌యం సాధించాడు. వ‌రుస‌గా మూడు గేమ్ లను గెలవడం విశేషం. బ్లిట్జ్ టై బ్రేక్‌లో రెండు గేమ్‌లు గెలిచాడు. కార్ల్‌స‌న్‌-ప్ర‌జ్ఞా మ‌ధ్య జ‌రిగిన తొలి రెండు గేమ్‌లు డ్రా అయ్యాయి. నాలుగ‌వ గేమ్‌ను గెలిచిన ప్ర‌జ్ఞా, మ్యాచ్‌ను టై బ్రేక్‌లోకి నెట్టేశాడు. టై బ్రేక్‌లో రెండు గేమ్‌లు గెలిచి కార్ల్‌స‌న్‌కు షాకిచ్చాడు.

కార్ల్‌స‌న్‌పై గెలిచినా.. తుది ఫ‌లితాల్లో మాత్రం రెండ‌వ స్థానంలో నిలిచాడు. నార్వేకు చెందిన కార్ల్‌స‌న్ అత్య‌ధిక స్కోర్‌తో టాప్ ప్లేస్ కొట్టేశాడు. కార్ల్‌స‌న్‌కు 16 మ్యాచ్ పాయింట్లు ద‌క్క‌గా, ప్ర‌జ్ఞానందకు 15 పాయింట్లు వ‌చ్చాయి. మూడ‌వ స్థానంలో అలిరిజా ఫిరౌజా నిలిచాడు. అత‌ను కూడా 15 పాయింట్లు సాధించాడు. ప్ర‌జ్ఞానంద చేతిలో ఓడినందుకు అత‌ను మూడ‌వ స్థానాన్ని స‌రిపెట్టుకున్నాడు. రెండవ స్థానంలో నిలవడంతో ప్రజ్ఞానంద $37,000 ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు. గత ఆరు నెలల్లోనే కార్ల్‌సెన్‌పై మూడు విజయాలు సాధించాడు ప్రజ్ఞానంద.


Next Story
Share it