పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీం విభాగంలోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. క్వాలిఫికేషన్-2లో మను భాకర్ – సౌరభ్ చౌదరి జోడీ నిరాశపరిచారు. 8 టీముల్లో 7వ స్థానంతో సరిపెట్టుకున్నారు. క్వాలిఫికేషన్ స్టేజీ-1లో 582 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఈ జోడి.. రెండో రౌండ్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. దీంతో పతక మ్యాచ్‌లకు అర్హత సాధించలేకపోయారు.
అలాగే.. యశస్విని- అభిషేక్ వర్మ జోడీ సైతం నిరాశపరిచింది. ఈ జోడీ 17వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఒలిపింక్స్ ఐదో రోజు ఆరు క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు పాల్గొనున్నారు. టేబుల్ టెన్నిస్‌లో పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో శరత్ కమల్ ఈ రోజు బరిలోకి దిగనున్నాడు. భారత పురుషుల హాకీ జట్టు స్పెయిన్‌తో తలపడుతుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌రాజ్ రాన్‌కీరెడ్డి, చిరాగ్‌శెట్టి బ్యాట్మింటన్ గ్రూప్-ఏలో పాల్గొననున్నారు. అలాగే సెయిలింగ్, బాక్సింగ్‌లోనూ భారత అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.