ICC ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ ఆతిథ్యంలో ప్రారంభం కానుంది. 2017 తర్వాత తొలిసారిగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ ఫైనల్ మార్చి 9న జరుగనుంది. అంతకుముందే.. భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి, ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఫైనల్‌కు వెళ్లే జట్లను అంచనాలు వేశారు. ఈ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కు వెళ్లనున్నట్లు ఇరువురు చెబుతున్నారు.
రికీ పాంటింగ్ ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. కష్టమైనా భారత్, ఆస్ట్రేలియా జట్లను ఎంపిక చేస్తానని చెప్పాడు. "ప్రస్తుతం రెండు దేశాల ఆటగాళ్ల నాణ్యత గురించి ఆలోచించండి. చరిత్రలో జరిగిన పెద్ద పెద్ద టోర్నీ ఫైనల్స్, ICC ఈవెంట్‌లు వెనక్కి తిరిగి చూసుకోండి. అనివార్యంగా ఆస్ట్రేలియా, భారత్ మాత్రమే ఫైనల్‌లో ఉన్నాయని పాంటింగ్ అన్నాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లను సెమీ-ఫైనలిస్టులుగా ఎంపిక చేశాడు.
2023 ODI ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగింది. రెండు జట్లు రెండుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్నాయి. 2023 WTC ఫైనల్ కూడా రెండు జట్ల మధ్య జరిగింది. కంగారూ జట్టు ODI ప్రపంచ కప్ 2023 ఫైనల్, WTC ఫైనల్ 2023 ఫైనల్‌ను గెలుచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్ 2002, 2013లలో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.