ఇక మేం నిశ్శబ్దంగా ఎలా ఉండగలం.. పురుషుల హాకీ జ‌ట్టుపై అభినంద‌న‌ల వెల్లువ‌

PM Narendra Modi congratulates mens hockey team.41 ఏళ్ల ఎద‌రుచూపుల‌కు తెర‌దించుతూ భార‌త పురుషుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2021 5:08 AM GMT
ఇక మేం నిశ్శబ్దంగా ఎలా ఉండగలం.. పురుషుల హాకీ జ‌ట్టుపై అభినంద‌న‌ల వెల్లువ‌

41 ఏళ్ల ఎద‌రుచూపుల‌కు తెర‌దించుతూ భార‌త పురుషుల హాకీ జ‌ట్టు ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కాన్ని సాధించింది. గురువారం బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి జ‌ర్మ‌నీతో జ‌రిగిన కాంస్య పోరులో 5-4 తేడాతో విజ‌యం సాధించి ప‌త‌కాన్ని ముద్దాడింది. దీంతో భార‌త హాకీ జ‌ట్టుపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌సంస‌ల జ‌ల్లు కురుస్తోంది. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు వెల్‌డ‌న్ బాయ్స్ అంటూ అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

41 ఏళ్ల తర్వాత ఒలింపిక్‌ పతకం గెలిచినందుకు శుభాకాంక్షలు. అద్భుతమైన నైపుణ్యం, ప్రతిభాపాటవాలు, అంకితభావంతో ఈ గెలుపు సాధ్యమైంది. గురువారం నాటి చారిత్రాత్మక విజయం భారత హాకీ చరిత్రలో మరో సరికొత్త యుగానికి నాంది అని, క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచుకునే విధంగా స్ఫూర్తినిస్తుందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ట్వీట్ చేశారు.

చరిత్రాత్మకం! ప్రతీ భారతీయుడి మనసులో ఈ జ్ఞాపకం ఎల్లప్పుడూ నిలిచి పోతుంది. కాంస్య పతకంతో స్వదేశానికి తిరిగి వస్తున్న భారత పురుషుల హాకీ జట్టుకు శుభాకాంక్షలు. ఈ ఘనత సాధించి జాతి మొత్తాన్ని గర్వపడేలా చేవారు. ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిచ్చారు. హాకీ జట్టు మనకు గర్వకారణం'' ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

41 ఏళ్ల ఎదురుచూపుల త‌రువాత భార‌త హాకీ, ఈ దేశ క్రీల‌కు ఇదొక సువ‌ర్ణ క్షణం. జ‌ర్మ‌నీని ఓడించి కాంస్య ప‌త‌కాన్ని గెలుచుకోవ‌డంతో సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు ముగింపు ల‌భించింది. భార‌త్ ఇప్పుడు సంబ‌రాలు చేసుకునే మూడ్‌లో ఉంది. మా హాకీ క్రీడాకారుల‌కు అభినంద‌లు అంటూ కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు ట్వీట్ చేశారు.

భారత్‌కు శుభాకాంక్షలు. అబ్బాయిలు.. మీరు సాధించేశారు! ఇక మేం నిశ్శబ్దంగా ఎలా ఉండగలం. ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ.. ఒలింపిక్‌ చరిత్రలో మరోసారి భారత విజయాన్ని మరోసారి లిఖించింది పురుషుల హాకీ జట్టు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం'' అని కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హర్షం వ్యక్తం చేశారు.

Next Story