మా బిడ్డ ఫోటోలు దయచేసి తీయకండి: విరుష్క దంపతులు
Pics Of Us OK, No Photos Of Baby Please Anushka Sharma Virat Kohli To Paparazzi. మా బిడ్డ ఫోటోలు దయచేసి తీయకండి: విరుష్క దంపతులు.
By Medi Samrat
విరాట్ సతీమణీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ తన ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. ఎంతో ఆనందంగా ఉంది అని అన్నాడు. ఈ రోజు మధ్యాహ్నం మాకు ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. మా జీవితంలో నూతన అధ్యాయనం ప్రారంభం కాబోతోంది. మీ ప్రేమ, ప్రార్థనలకు కృతజ్ఞతలు. ఈ సమయంలో మాకు కాస్త ప్రైవసీ ఇస్తారని ఆశిస్తున్నా అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. పలువురు ప్రముఖులు విరుష్క దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక పాపను బయటకు తీసుకుని వస్తే చాలు కెమెరాలు చుట్టుముట్టనున్న సంగతి తెలిసిందే.. అందుకే తమ ఫోటోలను తీసినా పర్లేదు.. పాప ఫోటోలు తీయకండని విరాట్-అనుష్క కోరుతున్నారు.
బుధవారం ముంబైలోని ఫొటో జర్నలిస్టులకు అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఓ నోట్ పంపారు. ఇన్నేళ్లు మాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. పాప పుట్టిన ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడం మరింత ఆనందంగా ఉందని తెలిపారు. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా మేం ఫోటో జర్నలిస్టులను కోరేది ఒక్కటేనని.. తమ బిడ్డ ప్రైవసీని కాపాడాలని అనుకుంటూ ఉన్నామని అన్నారు. ఈ విషయంలో మీ మద్దతు, మీ సాయం మాకు కావాలని.. దయచేసి మా బిడ్డకు సంబంధించి ఏ ఫొటోనూ ప్రచురించొద్దని కోరారు. కావాలంటే మాకు సంబంధించిన వార్తలు, ఫొటోలు వేసుకోండి కానీ తమ కుమార్తె ఫోటోలను తీయకండని కోరారు. మేం ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నామో అర్థం చేసుకుంటారని.. మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నామని ఫొటో జర్నలిస్టులకు విన్నవించుకున్నారు.