గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామా.. పాకిస్తాన్ కొత్త కోచ్ ఎవ‌రంటే..

గ్యారీ కిర్‌స్టన్ పాకిస్థాన్ కోచ్ పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

By Medi Samrat  Published on  28 Oct 2024 10:11 AM GMT
గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామా.. పాకిస్తాన్ కొత్త కోచ్ ఎవ‌రంటే..

గ్యారీ కిర్‌స్టన్ పాకిస్థాన్ కోచ్ పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామాను PCB ఆమోదించింది. అదే స‌మ‌యంలో PCB పాకిస్తాన్ కొత్త ప్రధాన కోచ్‌ను ప్రకటించింది. పాకిస్థాన్ కొత్త పరిమిత ఓవర్ల జట్టు ప్రధాన కోచ్‌గా జాసన్ గిల్లెస్పీకి బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు అక్టోబర్ 27న బాబర్ ఆజం స్థానంలో మహ్మద్ రిజ్వాన్‌ను కెప్టెన్‌గా నియమించారు. దీంతో పాకిస్తాన్ జట్టు తన కొత్త కెప్టెన్, కొత్త కోచ్‌తో ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనలకు వెళ్లనుంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే పరిమిత ఓవర్ల పర్యటనలో పాక్ పురుషుల జట్టుకు జాసన్ గిల్లెస్పీ కోచ్‌గా ఉంటారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన బ్లాగ్‌లో రాసింది. గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామాను పిసిబి ఆమోదించింది.

ESPNcricinfo నివేదిక ప్రకారం.. గ్యారీ కిర్‌స్టెన్, ఆటగాళ్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కోచింగ్ స్టాఫ్ నిర్ణయాలకు సంబంధించి పీసీబీతో కూడా విభేదాలు ఉన్నాయి. డేవిడ్ రీడ్‌ను హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా నియమించాలని కిర్‌స్టన్ అభ్యర్థించినట్లు సమాచారం. ఇది PCB ప్రాధాన్యతలకు అనుగుణంగా లేదు, ఇది ఉద్రిక్తతలకు దారితీసింది. వారు లేకుండా జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లనని బోర్డుకు తెలిపాడు. అతని మాటలను పీసీబీ అంగీకరించలేదు. దీంతో ఆయన బోర్డును తిరస్కరించారు. సెలక్షన్ కమిటీ మితిమీరిన జోక్యంతో కిర్‌స్టెన్ ఇబ్బంది పడ్డాడని.. దీంతో అతను నిరాశతో రాజీనామా చేశాడ‌ని తెలుస్తోంది.

Next Story