ఆ ఇద్దరూ మాకు అవకాశం ఇవ్వలేదు : పాట్ కమ్మిన్స్
లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
By Medi Samrat
లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ విజయంతో 27 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా తొలి ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తర్వాత దక్షిణాఫ్రికా WTC విజేతగా నిలిచింది.అద్భుతమైన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా సారధి పాట్ కమ్మిన్స్ తమ ప్రదర్శనపై మాట్లాడారు.
పాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాపై తొలి రెండు రోజుల్లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ ఓటమి పాలయ్యమన్నాడు. ప్రొటీస్ ఆటగాళ్లు ధైర్యసాహసాలు ప్రదర్శించారని, వారు చాంపియన్ షిప్‌కు అర్హులని కొనియాడారు. పరిస్థితి చాలా త్వరగా మారిపోయింది.. ఇక్కడ మేము గెలుపుకు దూరం అయ్యాం. కొన్ని తప్పులు చేశాము. తొలి ఇన్నింగ్స్‌లో మంచి ఆధిక్యం సాధించిన తర్వాత మేం బ్యాటింగ్ సరిగా చేయలేదు. నాలుగో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ మాకు అవకాశాలు ఇవ్వలేదు. గత రెండేళ్లుగా ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేశారు. తొలి రెండు రోజుల్లో బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు.
మేము అన్ని అవకాశాలు ప్రయత్నించాం. నాథన్ లయన్ ముఖ్యంగా బాగా బౌలింగ్ చేసాడు, కానీ వికెట్లు పడలేదు. ఐడెన్, టెంబా మాకు అవకాశం ఇవ్వలేదు. దక్షిణాఫ్రికా జట్టు ఇక్కడ వరకూ వచ్చారు.. వారు విజేతలుగా ఉండటానికి అర్హులని చూపించారు, వారు మ్యాచ్‌ను నిలబెట్టుకున్నారు. నాకు టెస్ట్ క్రికెట్ అంటే ఇష్టం. ఫైనల్‌కు చేరుకోవడం గొప్ప విజయం అని పేర్కొన్నాడు.