63 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన పాట్ కమిన్స్
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కమిన్స్ 63 ఏళ్ల రికార్డును ధ్వంసం చేశాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి ఆస్ట్రేలియా కెప్టెన్‌గా నిలిచాడు.
వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బార్బడోస్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ రెండో రోజు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ రోస్టన్ చేజ్ వికెట్ తీసి చరిత్ర పుటల్లో తన పేరును నమోదు చేసుకున్నాడు.
టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి ఆస్ట్రేలియా కెప్టెన్‌గా నిలిచాడు. తద్వారా 63 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో ఈ రికార్డు రిచీ బెనాడ్ పేరిట ఉండేది. ఇప్పుడు అతని కంటే పాట్ కమిన్స్ ముందున్నాడు. రిచీ బెనాడ్ 1964లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. కెరీర్‌లో మొత్తం 248 వికెట్లు పడగొట్టాడు.
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా అత్యధిక వికెట్లు:-
పాట్ కమిన్స్: 139 వికెట్లు
రిచీ బెనాడ్: 138 వికెట్లు
బాబ్ సింప్సన్: 41 వికెట్లు
ఇయాన్ జాన్సన్: 39 వికెట్లు
మాంటీ నోబుల్: 31 వికెట్లు
అంతే కాకుండా ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు. మొదటి స్థానంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు. కెప్టెన్‌గా టెస్టు క్రికెట్‌లో 187 వికెట్లు తీశాడు.
తొలి టెస్టు మ్యాచ్ గురించి చెప్పాలంటే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 180 పరుగులకే పరిమితమైంది. దీనికి సమాధానంగా వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగులు చేసింది. వెస్టిండీస్‌కు 10 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.