టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ పార్థివ్‌ పటేల్ ఇంట‌ విషాదం

Parthiv Patel's father passes away.టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ పార్థివ్‌ పటేల్ ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న తండ్రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Sept 2021 2:21 PM IST
టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ పార్థివ్‌ పటేల్ ఇంట‌ విషాదం

టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ పార్థివ్‌ పటేల్ ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న తండ్రి అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని పార్థివ్‌ పటేల్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు. కాగా..గ‌త కొంత‌కాలంగా అజయ్‌భాయ్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఆదివారం ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో తుదిశ్వాస విడిచారు.

'మా నాన్న అజయ్‌భాయ్‌ బిపిన్‌చంద్ర పటేల్ మ‌మ్మ‌ల్ని విడిచి వెళ్లిపోయార‌ని తెలియ‌జేసేందుకు చింతిస్తున్నాం. మేము తీవ్ర విషాదంలో మునిగిపోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించగలరు' అని పార్దివ్ పటేల్ ట్వీట్ చేశారు.

మాజీ క్రికెటర్లు స‌చిన్ టెండూల్క‌ర్‌, ఆర్పీ సింగ్‌, ప్రజ్ఞాన్‌ ఓజాలు పార్థివ్‌ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. అభిమానులు కూడా పార్థివ్ కుటుంబానికి సంతాపం తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు.

టీమ్ఇండియా తరఫున పార్థివ్‌ 25 టెస్టుల్లో 934 పరుగులు సాధించాడు. ఇందులో 6 అర్ధ శతకాలు ఉన్నాయి. వికెట్‌ కీపర్‌గా 62 క్యాచ్‌లు పట్టిన అతడు 10 స్టంపింగ్‌లు చేశాడు. 38 వన్డేల్లో 736 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

Next Story