మను భాకర్ మరో మెడల్ ను భారత్ కు తెస్తుందని ఆశించిన అభిమానులకు షాక్ తగిలింది. నాలుగో స్థానంలో నిలిచిన మనుభాకర్ తృటిలో మూడో మెడల్ ను కోల్పోయింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్ లో మను భాకర్ ఒకానొక దశలో రెండో స్థానంలో నిలిచి.. భారత్ కు పతకంపై ఆశలను రేకెత్తించింది.. మొదటి మూడు స్థానాల్లో నిలవడానికి జరిగిన పోటీలో మనుభాకర్ 5 షాట్‌లలో 3 టార్గెట్ ను తగిలాయి. అయితే హంగేరియన్ షూటర్‌తో జరిగిన షూటౌట్‌లో మాత్రం ఓటమి పాలైంది.
మాజీ ప్రపంచ రికార్డు హోల్డర్ వెరోనికాకు, మను భాకర్ కు 28 పాయింట్లకు టై కావడంతో షూట్ ఆఫ్ జరిగింది. మను నాలుగో స్థానంలో నిలిచింది. రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు ఈ విభాగంలో గోల్డ్ మెడల్ లభించింది.