టీమిండియా క్వార్ట్రర్ ఫైనల్స్ లో తలపడేది ఈ జట్టుతోనే!!

ఆదివారం నాడు పారిస్ ఒలింపిక్స్ 2024 క్వార్టర్ ఫైనల్‌లో భారత పురుషుల హాకీ జట్టు గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Aug 2024 1:01 PM IST
paris olympics, indian, hockey team,

టీమిండియా క్వార్ట్రర్ ఫైనల్స్ లో తలపడేది ఈ జట్టుతోనే!! 

ఆదివారం నాడు పారిస్ ఒలింపిక్స్ 2024 క్వార్టర్ ఫైనల్‌లో భారత పురుషుల హాకీ జట్టు గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది. శుక్రవారం జరిగిన పూల్-బిలో చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు మంచి జోష్ తో క్వార్ట్రర్స్ లో అడుగుపెట్టింది. 1972 మ్యూనిచ్ గేమ్స్ తర్వాత ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాపై భారత్ మొదటి విజయం. ఈ విజయంతో భారత్ రెండో స్థానంలో నిలిచింది. క్వార్టర్ ఫైనల్స్‌లో గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది.

ఈ మెగా ఈవెంట్‌లోని ఇతర మూడు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లు ఆదివారం జరగనున్నాయి. యాదృచ్ఛికంగా, టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్ట్రర్స్ తరహాలోనే ఈసారి కూడా జట్లు తలపడనున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఈవెంట్‌లో న్యూజిలాండ్‌పై 3-2 తేడాతో అద్భుతమైన విజయంతో టోర్నీని ప్రారంభించారు. రెండో గేమ్‌లో 1-1తో అర్జెంటీనాతో మ్యాచ్ ను డ్రా చేసుకుంది. మంగళవారం జరిగిన మూడో గ్రూప్ దశలో జరిగిన పోరులో భారత జట్టు 2-0 స్కోరుతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. ఆ తర్వాత బెల్జియం చేతిలో 1-2తో ఓడిపోగా.. ఆసీస్ మీద 3-2 తో విజయం సాధించి తిరిగి విజయాల బాట పట్టింది. క్వార్టర్స్ లో బలమైన బ్రిటన్ ను భారత జట్టు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Next Story