Paris Olympics 2024: ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌ అడుగుపెట్టిన నిఖత్‌ జరీన్‌

మహిళల 50 కేజీల ఒలింపిక్స్‌లో నిఖత్‌ జరీన్‌ సత్తా చాటింది. ఆమె ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌ లోకి ప్రవేశించింది.

By అంజి
Published on : 28 July 2024 8:15 PM IST

Paris Olympics, Olympics 2024, Nikhat Zareen, Boxing

Paris Olympics 2024: ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌ అడుగుపెట్టిన నిఖత్‌ జరీన్‌

మహిళల 50 కేజీల ఒలింపిక్స్‌లో నిఖత్‌ జరీన్‌ సత్తా చాటింది. ఆమె ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌ లోకి ప్రవేశించింది. జర్మనీ క్రీడాకారిణి మ్యాక్సీ కరీనా క్లోట్జర్‌పై 5-0తో గెలిచింది. రౌండ్‌ ఆఫ్‌ 16 లోకి నిఖత్‌ జరీన్‌ ప్రవేశించింది. రౌండ్‌ ఆఫ్‌ 16లో చైనాకి చెందిన టాప్‌ సీడెడ్‌ వుయూతో నిఖత్‌ జరీన్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌ ఆగస్టు 1 మధ్యాహ్నం 2:30 గంటలకు జరగనుంది.

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రమితా జిందాల్ ఫైనల్‌కు అర్హత సాధించింది. 631.5 స్కోరుతో ఐదో స్థానంలో నిలిచి ఫైనల్ రౌండ్ కు అర్హత సాధించింది. 104.3, 106.0, 104.9, 105.3, 105.3, 105.7 చొప్పున స్కోర్లు సాధించింది. తొలి 8 స్థానాల్లో నిలిచిన షూటర్లు సోమవారం జరిగే ఫైనల్‌లో పోటీపడనున్నారు.

Next Story