లక్ష్య సేన్, సింధు, శ్రీజ ఆకుల ముందంజ

పారిస్ ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ అకుల మహిళల సింగిల్స్‌లో 16వ రౌండ్‌లో తన స్థానాన్ని కైవసం చేసుకుంది.

By Medi Samrat  Published on  31 July 2024 4:28 PM IST
లక్ష్య సేన్, సింధు, శ్రీజ ఆకుల ముందంజ

పారిస్ ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ అకుల మహిళల సింగిల్స్‌లో 16వ రౌండ్‌లో తన స్థానాన్ని కైవసం చేసుకుంది. సింగపూర్‌కు చెందిన జియాన్ జెంగ్‌ను 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10 స్కోరుతో ఓడించింది. ఈరోజు ఆమె పుట్టినరోజు. 26 ఏళ్ల శ్రీజ ఇప్పుడు ఒలంపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ ప్రీ-క్వార్టర్స్‌కు చేరుకున్న రెండవ భారతీయురాలిగా అవతరించింది. ఈ ఒలింపిక్స్ లోనే మనిక బాత్రా ప్రీ క్వార్టర్స్ కు చేరుకుంది.

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. మాల్దీవులపై మొదటి లీగ్ మ్యాచ్‌లో సునాయసంగా గెలిచిన సింధు.. తన రెండో మ్యాచ్‌లోనూ ఎస్తోనియాకు చెందిన కుబా క్రిస్టిన్‌పై ఘన విజయం సాధించింది. 21-5, 21-10 తేడాతో వరుస రెండు సెట్లలో పీవీ సింధు విజయం సాధించింది.

ఇక లక్ష్యసేన్ బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా క్రీడాకారుడు జోనాటన్ క్రిస్టీపై 21-18, 21-12 తేడాతో వరుస రెండు సెట్లను గెలుచుకున్నాడు. గేమ్ 1లో 2-8తో వెనుకబడిన తర్వాత లక్ష్యసేన్ అద్భుతంగా రాణించాడు. రెండు గేమ్‌లను 21-18, 21-12 తేడాతో గెలుచుకున్నాడు. 8 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ నాకౌట్‌కు అర్హత సాధించిన తొలి షట్లర్ గా లక్ష్య నిలిచాడు.

Next Story