Video : ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ముందు పూజ‌లు చేసిన పంజాబ్ కోచ్‌.. పాక్‌ ఫ్యాన్స్ ఆగ్ర‌హం

క్రికెట్ లెజెండ్‌, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన జట్టు పంజాబ్ కింగ్స్‌తో కలిసి IPL 2025కి ముందు సాంప్రదాయ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

By Medi Samrat
Published on : 21 March 2025 2:09 PM IST

Video : ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ముందు పూజ‌లు చేసిన పంజాబ్ కోచ్‌.. పాక్‌ ఫ్యాన్స్ ఆగ్ర‌హం

క్రికెట్ లెజెండ్‌, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన జట్టు పంజాబ్ కింగ్స్‌తో కలిసి IPL 2025కి ముందు సాంప్రదాయ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రికీ పాంటింగ్‌ పూజలు చేయడం చూసి ఓ పాకిస్థానీ అభిమానుల‌కు కోపం వచ్చింది. మతాన్ని క్రికెట్‌తో కలిపారు.. ఎందుకు? అని ప్ర‌శ్నించారు.

IPL కొత్త సీజన్ ప్రారంభానికి ముందు భారతీయ సంప్రదాయం ప్రకారం.. జట్లు పూజ వేడుకలను నిర్వహిస్తాయి. పంజాబ్ కింగ్స్ కూడా ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు పూజా కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఇందులో జట్టు ఆటగాళ్లతో పాటు ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ కూడా పాల్గొనగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పాంటింగ్ హిందూ సంప్రదాయ ఆచారాల ప్రకారం.. పూజలు చేస్తున్నట్టు చూడవచ్చు.

ఈ వీడియో వైరల్ కావడంతో పాక్ క్రికెట్ అభిమాని ఒకరు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లోని క్రికెట్ అభిమానులు పంజాబ్ కింగ్స్ క్యాంప్ నిర్వహించిన పూజ వేడుక వీడియోను వీక్షించి.. అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. 'క్రికెట్‌ను మతంలో కలపాలా.. కానీ ఎందుకు?' అని ప్ర‌శ్నించారు. ఇంతకు ముందు పాకిస్తాన్ అభిమానులు.. KKR జట్టు వికెట్ పూజపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. వ్యంగ్యంగా ఎగతాళి చేశారు.

ఈ విమ‌ర్శ‌లు 2023 ODI ప్రపంచ కప్ సమయంలో ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో శ్రీలంక, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ సెంచరీ చేసిన తర్వాత మిడిల్ గ్రౌండ్‌లో నమాజ్ చేశాడు. దీనిపై ఢిల్లీ న్యాయవాది ఒకరు ఐసీసీ, బీసీసీఐ, పీసీబీకి ఫిర్యాదు చేశారు. ఇది ఆట స్ఫూర్తికి విరుద్ధమని, క్రికెట్‌ను మతంతో ముడిపెడుతున్నారని భారతీయ న్యాయవాది తన ఫిర్యాదులో రాశారు.

రాబోయే సీజన్ కోసం పాంటింగ్ పంజాబ్ కింగ్స్‌కు ప్రధాన కోచ్‌గా నియమించబడ్డాడు. ఇంతకు ముందు రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోచ్‌గా ఉన్నాడు. 50 ఏళ్ల పాంటింగ్ క్రికెట్‌లో చాలా అనుభవజ్ఞుడు. పంజాబ్ కింగ్స్ తొలిసారి ట్రోఫీ గెల‌వాల‌ని కోరుతూ ఇతర కోచ్‌లు, సహాయక సిబ్బందితో పాటు ఆటగాళ్లు పూజ వేడుకలో పాల్గొన్నారు.

Next Story