బాబర్ ను ఏకంగా జట్టులో నుండే తీసేశారు!!
ఇంగ్లాండ్‌తో జరగనున్న మిగిలిన రెండు టెస్టులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
By Medi Samrat Published on 13 Oct 2024 11:05 AM GMTఇంగ్లాండ్‌తో జరగనున్న మిగిలిన రెండు టెస్టులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌కు షాక్ ఇచ్చింది. ఫామ్ లేకపోవడంతో పాటూ ఇటీవల పలు వివాదాలు బాబర్ ను చుట్టముట్టడంతో అతడిని టీమ్ నుండి తప్పించేశారు. అతనితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్, ఫాస్ట్ బౌలర్లు షాహీన్ అఫ్రిది, నసీమ్ షాలను కూడా టీమ్ నుండి తప్పించారు.
స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఉండడంతో అతడిని కూడా తప్పించారు. తప్పించిన ఆటగాళ్ల స్థానంలో హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్, కమ్రాన్ గులామ్ , ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అలీ, ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ లను జట్టులోకి తిరిగి తీసుకున్నారు. పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యుడు అకిబ్ జావేద్, మిగిలిన రెండు టెస్టులకు జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్లకు పెద్ద సవాలుగా మారిందని అంగీకరించాడు. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ అంతర్జాతీయ షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు జావేద్ వెల్లడించాడు.
పాకిస్థాన్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, హసీబుల్లా, కమ్రాన్ గులామ్, మెహ్రాన్ ముంతాజ్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా, జాహిద్ మెహమూద్.

Next Story